Home » Entertainment » Mahesh Babu Enjoyed With Sitara
Entertainment

Mahesh Babu : చిన్న పిల్లాడిలా మారి కూతురితో స‌ర‌దాగా ఆడుకుంటున్నమ‌హేష్ బాబు.. మురిసిపోతున్న‌ప్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 13, 2022, 1:00 pm
Advertisement

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప‌క్కా ఫ్యామిలీ ప‌ర్స‌న్ అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్ప‌క కేటాయిస్తుంటాడు. వాటికి సంబంధింన తీపి గురుతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు నమ్రత. మ‌హేష్ షూటింగ్ ఉంటే సెట్ లో.. లేకుండే ఇంట్లో.. అదీ కాకుండే ఫారెన్ టూర్ లో అది కూడా ప్యామిలీతోనే కలిసి వెళ్తుంటారు మహేష్ . ఫ్యామిలీలేకుండా ఒంటరిగా ఆయన కనిపించిన సందర్భాలు లేవసలు. ఇక వారి ఫ్యామిలీమూమెంట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు ఆయన భార్య నమ్రత. రీసెంట్‌గా కుక్క‌తో పాటు పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్న క్ష‌ణాల‌ను నమ్ర‌త త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

ఇక తాజాగా మ‌హేష్ బాబు చిన్న పిల్లాడిలా మారి కూతురితో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కూతురితో మ‌హేష్‌కి ఉన్న బాండింగ్ గురంచి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్కువ స‌మ‌యాన్ని ఆమెతోనే గడుపుతుంటాడు మ‌హేష్‌. ఇదిలా ఉంటే నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమా కథల సంగతి ఏమో కానీ… మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారనే టాక్ కూడా ఉంది.

mahesh babu enjoyed with sitara

Advertisement

Mahesh Babu : కూతురితో స‌ర‌దాగా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా మే 12న విడుద‌ల కానుంది. తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ లీకైంది. ఈ సినిమాలోని మొదటి పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయాలనీ టీమ్ భావించింది. అందులో భాగంగానే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను వదిలారు. అయితే లీకు వీరులు మాత్రం ముందే వదిలారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఏం చేస్తుందంటూ మహేష్ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్ అఫీషియ‌ల్‌గాఈ రోజు సాయంత్రం విడుద‌ల కానుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి