Home » Entertainment » Mahesh Babu Guest Role In Pawan Kalyan Movie
Entertainment

Mahesh Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో మ‌హేష్ బాబు గెస్ట్ రోల్ అలా మిస్ అయింద‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 29, 2022, 3:20 pm
Advertisement

Mahesh Babu : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాప్ స్థానాల‌లో ఉన్నారు. ఎవ‌రికి వారు ఇండివిడ్యువ‌ల్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టిస్తే బాక్సాఫీస్ షేక్ కావ‌ల్సిందే. వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌క‌పోయిన సాయం చేసుకున్నారు. గతంలో మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. నా ప్రెండ్ సంజయ్ సాహు అంటూ మహేష్ పవన్ ను పరిచయం చేయడం ఇద్దరి అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి పవన్, మహేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు.

Advertisement

అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో మహేష్ చిన్న పాత్రలో నటించాల్సి ఉందట కానీ అది మిస్ అయ్యిందట. పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో అత్తారింటికి దారేది ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబును గెస్ట్ రోల్ లో తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ సినిమాలో సమంత ఇంటి నుంచి వెళ్లిపోగా విలన్ ఆమె కారు పై దాడి చేసి ఆమెని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు.ఆ సమయంలో మహేష్ బాబు ఖలేజా సినిమాలో నటించిన టాక్సీ డ్రైవర్ రాజు పాత్రను ఎంటర్ చేద్దామని త్రివిక్రమ్ అనుకున్నార‌ట‌.

mahesh babu guest role in Pawan Kalyan movie

Advertisement

Mahesh Babu : చిన్న గ్యాప్..

ఇదే విషయం మహేష్ బాబుకు చెప్తే.. కథ మంచి ఫ్లోలో ఉన్న సమయంలో గెస్ట్ రోల్ వస్తే కథ సైడ్ ట్రాక్ అవుతుంది. గెస్ట్ రోల్ ఎందుకు మంచి కథను సిద్ధం చేయండి మల్టీస్టారర్ సినిమా చేద్దాం అని మహేష్ అన్నారట. దాంతో ఆ చిత్రం మ‌హేష్ లేకుండా అలా ముగిసింది. అదే మ‌హేష్‌ కూడా న‌టించి ఉంటే మూవీ పీక్స్ లోకి వెళ్లేద‌ని కొంద‌రు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా మహేష్ , పవన్ తో గురూజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. గ‌తంలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేస్తాడ‌ని అందరు అనుకున్నారు. కాని అది కూడా అట‌కెక్కింది. ప్ర‌స్తుతం మ‌హేష్ మూవీతో బిజీగా ఉన్నాడు మాట‌ల మాంత్రికుడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి