Home » Entertainment » Mahesh Babu Is Reason For Major Movie Flop
Entertainment

Mahesh Babu : మేజర్ సినిమా ఫ్లాప్‌కు కారణం మహేష్ బాబునా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: June 14, 2022, 11:00 am
Advertisement

Mahesh Babu : హిందీ బెల్ట్‌లో మేజర్ సినిమా ఆశించిన వసూళ్ళు రాబట్టలేకపోవడానికి కారణం ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు అని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతవారం విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం విక్రమ్మ్ తో పోటీగా బాక్సాఫీస్ వద్ద బరిలో దిగింది అడివి శేష్ హీరోగా నటించిన మేజర్. మహేశ్ ఈ సినిమాను ఏ ప్లస్, సోనీ పిక్చర్స్ సంస్థలతో కలిసి నిర్మించారు. దాదాపు మూడేళ్ళకు పైగానే ఈ సినిమా నిర్మాణంలో ఉంది.26/11 ముంబై ఉగ్రవాది దాడుల్లో దేశ ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఆధారంగా మేజర్ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.

Advertisement

బయోపిక్ కావడం, సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి వచ్చిన ప్రతీది అంచనాలు పెంచగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు రిలీజైయ్యాక పాజిటివ్ టాక్ వచ్చింది. చెప్పాలంటే కమల్ విక్రమ్ సినిమాకు మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ, తీరా చూస్తే మేజర్ సినిమాకే టాక్ మారిపోయింది.అయినా టాలీవుడ్‌లో మహేశ్ చేసిన ప్రమోషన్స్ వల్ల బాగానే లాభాలు వచ్చాయి. సినీ తారలందరూ మేజర్ సినిమాను బాగా ప్రమోట్ చేశారు. కానీ, మహేశ్ లాంటి స్టార్, బిజినెస్ మేన్ ఉండి కూడా ఎందుకో హిందీలో సరిగ్గా మేజర్ సినిమాను ప్రమోట్ చేయలేదు.

Mahesh Babu is reason for major movie flop

Advertisement

Mahesh Babu : సినీ తారలందరూ మేజర్ సినిమాను బాగా ప్రమోట్ చేశారు.

వాస్తవంగా తెలుగు, మలయాళం కంటే కూడా హిందీలో మేజర్‌కు భారీ రెస్పాన్స్, భారీ వసూళ్ళు వస్తాయని అక్కడ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనీ అందరూ భావించారు. కానీ, మహేశ్‌కు ఈ సినిమాను హిందీలో ప్రమోట్ చేయాలనే ఆలోచన పెద్దగా లేనట్టు అనిపిస్తుంది. దాని ఫలితమే ఇప్పుడు అక్కడ పోయిందనే టాక్‌కి కారణం అంటున్నారు. ఇక మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఫైనల్‌గా చూసుకుంటే 15 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చింది. ఈ మధ్యకాలంలో మహేశ్ నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టినవే. కానీ, సర్కారు వారి పాట పోకిరి వైబ్స్ అని చెప్పినా నష్టాలను తెచ్చిపెట్టింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి