
Mahesh Babu : ఏంటి.. మహేష్ 29వ సినిమా కోసం రాజమౌళి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..?
Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చివరిగా గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు తం రాజమౌళి సినిమా కోసం చాల కష్టపడుతున్నాడు. మహేష్ ని స్క్రీన్ మీద ఇప్పట్లో చూసే అవకాశం లేదని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ కావడంతో రాజమౌళి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడేళ్లపాటు చిత్రీకరణ ఉంటుంది. మరి ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఎన్నేళ్లుటైం తీసుకుంటాడా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ఎంత లేదన్న రాజమౌళి ఒక సినిమా తీయాలంటే.. కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు సమయం పడుతుంది కాబట్టి మహేష్-రాజమౌళి సినిమాకి కనీసం నాలుగు సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు
ఇక ఇదిలా ఉంటే మహేష్ 29వ సినిమా కోసం మహేష్ బాబు తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లతో రాజమౌళి- మహేశ్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుండగా,మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంత ఖర్చు కానుందనే ప్రచారం జరుగుతుంది. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న SSMB 29 కోసం జక్కన్న ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని, దానికి బదులుగా రాజమౌళి సినిమాలలో లాభాలు తీసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. తెలుగు సినిమా స్థాయిని కూడా ప్రపంచ స్థాయి లో నిలబెట్టిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమా కోసం ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌కి బదులుగా సినిమా లాభాల్లో రాజమౌళి వాటా తీసుకోనున్నారని టాక్ వినిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా వరల్డ్ మూవీ కాబట్టి థియేటర్, ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ అంటూ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే చిత్రంలో నటించే నటీనటల కన్నా కూడా రాజమౌళికి ఎక్కువ రెమ్యునరేషన్ దక్కనుందని టాక్. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం భారీగా పారీతోషికం అందిపుచ్చుకోనున్నాడని సమాచారం అందుతుంది. చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.