Mahesh Babu six pack with trainer
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అపజయం అనేది లేకుండా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాకి సిద్ధమయ్యాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మాస్టర్ క్లాస్ మూవీ చేయబోతున్నాడు. .అతడు, ఖలేజా లాంటి సినిమాలతో మహేష్ లోని మరో యాంగిల్ చూపించిన త్రివిక్రమ్.ఇప్పుడు మరోసారి మహేష్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించనున్నారన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మొన్నామధ్య మహర్షి సినిమాలో గడ్డంతో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చారు. తాజాగా త్రివిక్రమ్ సినిమాలోనూ మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
మహేశ్ బాబు తాజాగా తన బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ కోసం జిమ్ వర్క్ అవుట్స్ ను ప్రారంభించారు. ప్రముఖ సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ గైడ్ లైన్స్ లో శిక్షణ మొదలెట్టారు. ఈయన హీరోల బాడీలను పాత్రలకు, షూటింగ్ కు అనుకూలంగా ట్రైన్ చేస్తారు. కఠినమైన శిక్షణతో అట్రాక్టివ్ ఫిట్ నెస్ ను తెప్పిస్తారు. సిక్స్ ప్యాక్ కోసం ఈయనని పలువురు హీరోలు అప్రోచ్ అవుతుంటారు. మహేష్ కూడా సిక్స్ ప్యాక్ కోసం ఇతడిని అప్రోచ్ అయ్యాడా అనే టాక్ వినిపిస్తుంది.
Mahesh Babu six pack with trainer
ఇతను గతంలో ఎన్టీఆర్‌తో కలిసి అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ సినిమాకి పని చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 31 వ సినిమాకి కూడా పని చేయబోతున్నాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే త్రివిక్రమ్ – మహేశ్ బాబు చిత్రం ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే మహేశ్ అదిరిపోయే లుక్ కూడా ఫైనల్ అయ్యింది. ఇటీవల ఆ పిక్ ను పంచుకోగా.. తాజాగా లాయిడ్ తో కలిసి మరో స్టైలిష్ పిక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.