Home » Entertainment » Mallemala Bring New Lady Judge Yamuna Came
Entertainment

Mallemala : మల్లెమాలు వారు మరో కొత్త లేడీ జడ్జ్ ను తీసుకు వచ్చారు.. ఈమెకు అంత సీన్ ఉందా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 9, 2023, 12:20 pm
Advertisement

Mallemala : ఈటీవీ లో ప్రసారమవుతున్న మల్లెమాల వారి కార్యక్రమాలు కొత్త కొత్త టాలెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. మల్లెమాల వారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు కార్యక్రమాలను ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు. అవి మాత్రమే కాకుండా పండుగ స్పెషల్ కార్యక్రమాలు అంటూ ఎన్నో ఈవెంట్స్ ని తీసుకు రావడం జరిగింది. ఇక మల్లెమాల వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త లేడీ జడ్జ్‌ దొరికినట్లే అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.

Advertisement

గత కొన్ని రోజులుగా సీనియర్ నటి యమున మల్లెమాల వారి కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కనుక ఆమె ముందు ముందు వరుసగా ఈటీవీ కార్యక్రమాల్లో ముఖ్యంగా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతం లో రోజా కారణంగా జబర్దస్త్ మరియు ఇతర కార్యక్రమాలకు మంచి పాపులారిటీ లభించింది. ఆ స్థాయిలో యమున కార్యక్రమాలకు పాపులారిటీని తీసుకు రాగలదా, ఆమెకు అంత సీన్ ఉందా అంటూ కొంత మంది ఈ సమయంలో చర్చించుకుంటున్నారు. యమున హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.

mallemala bring new lady judge yamuna came

Advertisement

ప్రస్తుతం బుల్లి తెరపై సీరియల్స్ తో సందడి చేస్తుంది. ఆ మధ్య కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన యమున ఇప్పుడు మళ్లీ సినిమాలు తో బిజీ అయింది. బుల్లి తెరపై తనదైన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న యమునకు మల్లెమాల వారి నుండి వచ్చిన ఆఫర్ తో ఆమె స్థాయి మరింతగా పెరిగినట్లు అయింది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఆమె ఇంద్రజ మరియు రోజా ల స్థాయిలో ఈటీవీ మల్లెమాల లో సందడి చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి