Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు లేకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉండీ కూడా వేస్ట్. ఆ సంగతి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోకు హైపర్ ఆది.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ ప్రాణం వంటివి. కానీ ఇప్పుడు ఆ రెండు టీంలు కూడా లేవు. దీంతో ఆ రెండు షోలు బిక్కు బిక్కు మంటున్నాయి. ఆది ఎందుకు వెళ్లాడో తెలియడం లేదు. ఇక గెటప్ శ్రీను, సుధీర్ సినిమా అవకాశాలు వస్తుండటంతో వెళ్లారని అంటున్నారు.కానీ సుధీర్ మాత్రం స్టార్ మాలో ఓ షో చేస్తున్నాడు. ఇక్కడ వదిలేసి అక్కడ ఎందుకు చేస్తున్నాడన్న దానికి సమాధానం లేదు.
అయితే ఆటో రాం ప్రసాద్ మాత్రం ఒంటిగానే లాగుతున్నాడు. స్కిట్లను ఒడ్డున చేర్చేందుకు ఈదుతూనే ఉన్నాడు. ఒక్కడే రాయడం ,చేయడం, స్కిట్లను నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి రాం ప్రసాద్ మాత్రం ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఆ విషయాన్ని రాకింగ్ రాకేష్ ఓ స్కిట్ రూపంలో బయట పెట్టేశాడు. ఇందులో సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను పాత్రలను పోషించి.. స్టేజ్ మీద అందరినీ ఏడిపించేశారు. యాంకర్ రష్మీ, ఇంద్రజ, రాం ప్రసాద్ ఇలా అందరూ ఏడ్చేశారు. ఇక ఇంద్రజ అయితే తెగ ఎమోషనల్ అయింది. మళ్లీ త్వరలోనే మీ ముగ్గురూ కలిసి ఇక్కడ స్కిట్ చేయాలి.. అది చూసేందుకు నేను ఇక్కడ ఉండాలి..
ఇదే నేను ఆ దేవుడిని కోరుకునేది అంటూ ఇంద్రజ అనేసరికి అందరూ ఏడ్చేశారు. ఇక రాం ప్రసాద్ సైతం కంటతడి పెట్టేశాడు. తాను ఒంటరినయ్యాననిపిస్తోంది.. మిస్ యూ రా.. అని ఎమోషనల్ అయ్యాడు. అంటే పరోక్షంగా ఆ ఇద్దరిని రమ్మని పిలిచినట్టుగా ఈ స్కిట్ అనిపించింది. మల్లెమాల టీం ఆ సంకేతాన్ని ఆ ఇద్దరికీ ఇచ్చేందుకే ఈ స్కిట్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి గెటప్ శ్రీను, సుధీర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. లోలోపల ఏదో పెద్దగానే జరిగినట్టుంది. అందుకే ఆది, సుధీర్, గెటప్ శ్రీను వరుసగా బయటకు వచ్చేశారు. మళ్లీ ఇంకా ఎంత మంది వస్తారో చూడాలి. అంతకు ముందే అభి బయటకు వచ్చేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.