Manchu Vishnu : శ్రీహరి అంకుల్‌తో వచ్చి మా నాన్న కాళ్లు పట్టుకున్నావ్.. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. వీడియో
Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఈ నెల 10 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హీరో మంచు విష్ణు ప్యానెల్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంచు విష్ణు అరవై మందితో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తనకు అనుకూలంగా వేయించుకుంటున్నారని, ఇందుకుగాను కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ విష్ణుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఎన్నికల అధికారికి కంప్లయింట్ కూడా చేశారు.ఈ క్రమంలోనే చెన్నైలో ఉన్న అరవై ఏళ్లకు పై బడిన ఆర్టిస్టుల ద్వారా మంచు విష్ణు కుట్రకు పూనుకున్నాడని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఈ విషయంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున స్పందించాలని డిమాండ్ చేశారు.
manchu vishnu comments on prakashraj
Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ ‘వస్తాడు నా రాజు’ సినిమా డైరెక్టర్‌ను దుర్భాషలాడారు..
ఇకపోతే ప్రకాశ్ రాజ్ ఆరోపణల నేపథ్యంలో హీరో మంచు విష్ణు కూడా స్పందించారు. ప్రకాశ్‌రాజ్ అనవసరంగా ఫ్యామిలీ జోలికొస్తున్నారన్నారు. ప్రకాశ్ రాజ్ 2004-2005 సమయంలో రియల్ స్టార్ శ్రీహరితో మోహన్ బాబు దగ్గరకు వచ్చి అన్నయ్య అంటూ ఆయన కాళ్లు తాకారని మంచు విష్ణు చెప్పారు. శ్రీహరి స్వర్గంలో ఉన్నారని, ఆయన ప్రస్తుతం ఉండి ఉంటే ఆయన మీకు తగిన గుణపాఠం చెప్పేవారని ప్రకాశ్ రాజ్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే తను హీరోగా నటించిన సినిమా ‘వస్తాడు నా రాజు’ డైరెక్టర్‌ను షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్ దుర్భాషలాడాడని ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాఫీగా జరిగే సమయంలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Manchu Vishnu
బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంలు పెట్టినా అప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తారని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్‌రాజ్ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. జీవిత అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంచు విష్ణు అన్నారు. హీరో శ్రీకాంత్ కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నారని విష్ణు అన్నారు. మొత్తంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నట్లు అనిపిస్తున్నదని పలువురు అంటున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మధ్య రోజురోజుకూ మాటల యుద్ధం ఇంకా పెరుగుతున్నది. అయితే, ఈ నెల 10 తర్వాత మా అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుంది, ఏ ప్యానెల్ గెలుస్తుందో తెలుస్తుంది.
