kannappa Movie : కన్నప్ప ప్రెస్ మీట్.. ఆయనకి సినిమా ఎప్పుడు చూపిస్తారన్న ప్రశ్నకి విష్ణు ఆసక్తికర సమాధానం.. వీడియో !
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. లాంటి స్టార్స్ నటించడం, పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రిలీజ్ కి ముందు నేడు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు.
kannappa Movie : కన్నప్ప ప్రెస్ మీట్.. ఆయనకి సినిమా ఎప్పుడు చూపిస్తారన్న ప్రశ్నకి విష్ణు ఆసక్తికర సమాధానం..!
kannappa Movie : ఆయన ప్రశంసల కోసమే..
ఈ ప్రెస్ మీట్ లో విష్ణు, సినిమా దర్శకుడు ముకేశ్ కుమార్ కన్నప్ప సీక్వెల్ గురించి మాట్లాడారు. కాళహస్తి నుండి అర్చకులని తీసుకొచ్చి కన్నప్ప సినిమా చూపించాం. ఒక అర్చకుడు కన్నప్ప పార్ట్ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అది కష్టం కాబట్టి ప్రీక్వెల్ తీసే అవకాశం ఉండొచ్చు అని తెలిపారు. ఇక విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప శివుడిలో లీనం అయ్యాక ఇంక సీక్వెల్ ఏం ఉంటుంది. కానీ ప్రీక్వెల్ ఉంటుండొచ్చు.
అదంతా వార్ ఎపిసోడ్స్ తో ఉంటుంది. అది కూడా సినిమా రిజల్ట్ ని బట్టి ఆలోచిస్తాను అని తెలిపారు. కన్నప్ప సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలానే ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో కన్నప్ప ప్రీక్వెల్ చేస్తే తిన్నడు చేసే యుద్ధాల ఎపిసోడ్స్ తోనే తీసే అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చేసాడు విష్ణు.ఇక పవన్ కళ్యాణ్ సమయం తీసుకొని ఈ సినిమా చూపిస్తానని కూడా మంచు విష్ణు అన్నారు. ఆయన నాకు సీనియర్. ప్రశంసలు వస్తాయా, రావా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని విష్ణు అన్నారు.
