
Meenakshi Sheshadri : ఆయన ముద్దు బాగుంటుంది.. అందుకే అన్నిసార్లు లిప్ లాక్ అంటూ ఓపెన్ కామెంట్
Meenakshi Sheshadri : ఆపద్భాందవుడు చిత్ర హీరోయిన్ మీనాక్షి శేషాద్రి మీకు గుర్తుందా.. ఆమె అప్పట్లో తెలుగులోని అగ్రహీరోలతో ఆడిపాడింది. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో పుట్టారు. తమిళ కుటుంబానికి చెందిన మీనాక్షి శేషాద్రి.. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్యం పొందింది. పెయింటర్ బాబు సినిమాతోతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
బాలీవుడ్‌లో 30కి పైగా సినిమాల్లో నటించింది మీనాక్షి. తెలుగులోనూ చిరంజీవితో కలిసి నటించింది. అన్న ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటించిన విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్ర పోషించింది. అంతేకాదు మీనాక్షి1980-90లలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది మీనాక్షి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది. ప్రస్తుతం ఈమె అమెరికాలో కుటుంబంతో గడుపుతున్నారు.అప్పట్లో కుందనపు బొమ్మలా.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండేది ఈ నటి. ఇప్పుడు ఆమెకు 60 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె చార్మింగ్ లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Meenakshi Sheshadri : ఆయన ముద్దు బాగుంటుంది.. అందుకే అన్నిసార్లు లిప్ లాక్ అంటూ ఓపెన్ కామెంట్
అయితే తాజా ఇంటర్వ్యూలో సన్నీ డియోల్‌తో లిప్ లాక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిజానికి ముద్దు పెట్టాలంటే నరాలు తెగినంత పని అయ్యేది. చాలా భయమేసేది. 1987లో వచ్చిన డకైట్ మూవీలో ఆయన లిప్ లాక్ చేసిన విధానం బాగుంది. మా ఇద్దరి మధ్య మంచి ఈక్వేషన్, అండర్ స్టాండింగ్ ఉండేది. అందుకే ఆ తర్వాతి సినిమాలలో కూడా ఇద్దరం కలిసి ముద్దు సీన్స్ చేశామంటూ మీనాక్షి శేషాద్రి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.