
Mega Hero Marriage Fix With A Heroine Goes Viral
Mega Hero : మెగా ఫ్యామిలీ హీరో పవన్ తేజ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. పవన్ తేజ్‌కు.. మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్. ఇందులో హీరోయిన్‌గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇటీవల ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్ తేజ్ సహా తదితరులు హాజరయ్యారు.
మెగా సంబురాలు…
తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను పవన్‌తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని’ రాసుకొచ్చాడు. అటు మేఘన కూడా.. ‘నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు పవన్ తేజ. అటు మేఘన బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది. రెచ్చిపోదాం బ్రదర్ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు..
Mega Hero Marriage Fix With A Heroine Goes Viral
పలు స్పెషల్ షోలతో టీవీ స్క్రీన్ ప్రేక్షకులకు బాగా దగరైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్ అవుతుండగా, పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజులలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా, సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ కూడా త్వరలో జరగనుందని తెలుస్తుంది. కాగా, బైక్ ఆక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి తేజ్ చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు సాయి తేజ్. సుకుమార్ రైటింగ్స్ వారితో చేతులు కలిపిన సాయి తేజ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనడం మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్ ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.