Home » Entertainment » Mehreen Pirzada Mehreen Kaur Relation With Director
Entertainment

Mehreen Pirzada : స్టార్ డైరెక్ట‌ర్‌తో రిలేష‌న్ వ‌ల్ల‌నే మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ అయిందా?

Authored By
Sam C
The Telugu News | Published on: August 5, 2022, 6:00 pm
Advertisement

Mehreen Pirzada : టాలీవుడ్‌ని ఏలిన అందాల ముద్దుగుమ్మ‌ల‌లో మెహ్రీన్ కూడా ఒక‌రు. ఒక‌ప్పుడు ఈ అందాల ముద్దుగుమ్మ వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చ‌కుంటూ నానా ర‌చ్చ చేసింది. . చాలా కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేయలేకపోతోంది. అయినప్పటికీ ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అనే సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే క్యూట్‌నెస్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంది. అంతేకాదు, తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.
అందుకే క్యాన్సిలా?

Advertisement

మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా టాలీవుడ్‌లోని మిగిలిన యంగ్ హీరోయిన్లతో పోలిస్తే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. తన అందచందాలతో చాలా కాలంగా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే మెహ్రీన్ క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ త‌న సినిమాల‌లో వ‌రుస సినిమా ఛాన్స్ లు ఇస్తూ ఆమె కెరియ‌ర్‌ని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. ఆ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డింద‌ని, ఆ రిలేష‌న్ వ‌ల్ల‌నే మెహ్రీన్ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింద‌ని అనేక పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

Mehreen Pirzada mehreen kaur relation with director

Advertisement

మెహ్రీన్ మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో ప్రస్తుతం కేరీర్ పైనే పూర్తిగా శ్రద్ధ వహిస్తోంది. రీసెంట్ గా ‘ఎఫ్3’ F3తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ బ్యూటీ.. తాజాగా స్పార్క్ అనే చిత్రంలో నటిస్తోంది. మరో కన్నడ ఫిల్మ్ లోనూ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాల తర్వాత మెహ్రీన్ లిస్ట్ లో పెద్దగా సినిమాలేవీ లేవనే చెప్పాలి. ఇక సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఆమె పిక్స్‌కి తెగ రెస్పాన్స్ వ‌స్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి