Home » Entertainment » Memes Trending On Pawan Kalyan And Sujeeth
Entertainment

Pawan Kalyan – Sujeeth : పవన్ కల్యాణ్ – సుజీత్ సినిమా మీద విపరీతంగా వైరల్ అవుతోన్న 10 టాప్ మీమ్స్..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 5, 2022, 11:00 am
Advertisement

Pawan Kalyan – Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో మూవీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చేసింది. నిజానికి.. పవన్ కళ్యాణ్, సుజీత్, డీవీవీ దానయ్య కాంబోలో సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. నిజానికి సుజీత్ రన్ రాజా రన్ సినిమా తీసి తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి చాటాడు. కానీ.. ఆ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

Advertisement

దీంతో సుజీత్ కెరీర్ ఒక్కసారిగా వెనక్కి మళ్లింది.తాజాగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య అనౌన్స్ చేశాడు. ఎరుపు రంగులో పోస్టర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ను వెనుక నుంచి చూపించి.. అందరూ ఆయన్ను ఓజీ అని పిలుస్తారు అంటూ హ్యాష్ ట్యాగ్ కు ఓజీని జత చేర్చారు. అయితే.. ఆ పోస్టర్ లో అర్థం చేసుకుంటే చాలా ఉన్నాయి కానీ.. ఆ పోస్టర్ కొందరికి అర్థం కావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ సినిమాపై మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. హ్యాష్ ట్యాగ్ పేరుతో ఓజీ అని పెట్టడంతో అసలు ఓజీ అంటే ఏంటి..

memes trending on pawan kalyan and sujeeth

Advertisement

Pawan Kalyan – Sujeeth : ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టరా?

ఒరిజినల్ గ్యాంగ్ స్టరా? కొన్ని సార్లు రావడం మాత్రం లేట్ అవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా. తుఫాను వస్తోంది. ఆది వర్కవుట్ అయ్యేలా ఉందిరా. ఉన్నాయ్.. మూవీలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయ్. ఒక కల్ట్ ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటదో.. మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. రీమేక్ మూవీస్ తోనే రికార్డ్స్ పెడతాడు. ఈసారి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా డైరెక్ట్ మూవీతో వస్తున్నాడు. రిజల్ట్ ఎలా ఉంటదో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా అంటూ.. ఇలా ఆ సినిమాపై మీమ్స్ క్రియేట్ చేశారు. చూద్దాం మరి ఈ సినిమాకు సంబంధించిన ఇంకా ఎన్ని అప్ డేట్స్ వస్తాయో.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి