mirchi villain warns to trivikram
Trivikram : సంపత్ రాజ్.. ఆయన మర్చి సినిమాతో పాపులర్ యాక్టర్‌గా మారాడు. ఈ సినిమా తర్వాత నుండి ఆయనకు విలన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్‌గా చాలా అవకాశాలు అందుకున్నాడు. తెలుగులో పాపులర్ యాక్టర్స్‌లో ఒకరిగా ఉన్న సంపత్ రీసెంట్‌గా ఆలీతో సరదాగా షోకి హాజరయ్యాడు. ఆయన అనేక ఆసక్తికర సంగతులు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ కి వార్నింగ్ ఇచ్చానంటూ ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. హోస్ట్ ఆలీ ఓ స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చావట? సెట్స్ కి వచ్చి కెమెరాలు ఎత్తుకుపోతా అన్నావట? అని అడుగగా అవునని సంపత్ ఒప్పుకున్నారు. ఆయన త్రివిక్రమ్ అని కూడా తెలియజేశారు.ఐతే దర్శకుడు త్రివిక్రమ్ కి సంపత్ రాజ్ ఇచ్చింది సీరియస్ వార్నింగ్ కాదులెండి.
తనను మర్చిపోకుండా మంచి ఆఫర్ ఇవ్వాలంటూ అలా సరదా వార్నింగ్ ఇచ్చాడన్న మాట. త్రివిక్రమ్ తో సంపత్ కి మంచి రిలేషన్ ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి చిత్రాలలో సంపత్ విలన్ రోల్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరి మధ్య ఇలాంటి ఆసక్తికర సంభాషణ జరిగింది.తన కుటుంబం గురించి చెప్తూ.. ‘మా నాన్న పెళ్లిచూపుల కోసం యూనిఫామ్‌లో వెళ్లినప్పుడు అమ్మ ఇల్లు కడుగుతోందట. ఆమెను చూసి ఎవరో పనిమనిషి అనుకున్నాడట. ఆయన్ను చూడగానే అమ్మ పరుగెత్తుకుంటూ లోపలకు వెళ్లి పోలీసులొచ్చారని చెప్పింది. అలా వాళ్ల మొదటి పరిచయం జరిగింది. మా పేరెంట్స్‌కు మేము ఏడుగురం సంతానం.
mirchi villain warns to trivikram
అందులో నేను ఆఖరివాడిని’ అని చెప్పుకొచ్చాడు.ఆర్టిస్టు శరణ్య, ఆమె ఫ్యామిలీ.. తనకు, తన కుటుంబానికి చాలా క్లోజ్ అన్న సంపత్ ఆమెతో కలిసి ఒక సినిమాలో నటించానని తెలిపాడు. అయితే ఆ మాత్రం దానికే ఆమెను తన మాజీ భార్యగా పేర్కొంటూ అసత్యపు వార్తలు రాశారని, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. తన తల్లికి సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో తండ్రే ఇంటి నుంచి పారిపోమని సలహా ఇచ్చారని తెలిపాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.