Home » Entertainment » Mohan Babu Not Like Manchu Manoj Second Marriage
Entertainment

Manchu Manoj : మంచు మ‌నోజ్ రెండో వివాహం మోహ‌న్ బాబుకి ఇష్టం లేదా.. ఆస్తి పంప‌కాలు జ‌రుగుతున్నాయా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 6, 2022, 2:30 pm
Advertisement

Manchu Manoj : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ దాంప‌త్య జీవితం ఏమైందో మ‌నం చూశాం. పెళ్లైన కొద్ది రోజుల‌కే దంప‌తులు ఇద్ద‌రు విడాకులు తీసుకున్నారు. ఇక కొంత కాలంగా సింగిల్‌గా ఉంటున్న మంచు మ‌నోజ్.. భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె.. మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరి అయిన మౌనిక రెడ్డితో రెండో వివాహం చేసుకోబోతున్నాడ‌నే వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కారణాలు బయటకు రాకపోయినా.. ఆ తరువాత ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

Advertisement

Manchu Manoj : మ‌నోజ్ ఏం చేయ‌బోతున్నాడు..!

ఇటీవల మనోజ్.. భూమా మౌనికతో కలసి గణేష్ పూజలో కనిపించాడు. భూమా మౌనిక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడంతో ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలం నుంచి మనోజ్, మౌనిక రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికతో వివాహం గురించి మంచు మనోజ్ ని మీడియా ప్రశ్నించగా అది తన వ్యక్తిగత విషయం అని, సమయం వచ్చినప్పుడు చెబుతానని హింట్ ఇచ్చారు. దీనితో మనోజ్, మౌనిక వివాహం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

Mohan Babu not like Manchu Manoj second marriage

Advertisement

అయితే మౌనికతో వివాహానికి మనోజ్ తన ఫ్యామిలిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ త‌న పెళ్లి విష‌యంలో కుటుంబంతో విభేదిస్తున్నారట. మనోజ్ పట్టు పట్టడంతో కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. వివాహం తర్వాత మోహన్ బాబు ఆస్తి పంపకాలు చేసేందుకు నిర్ణయించుకున్నారట. చాలా కాలం నుంచి మంచు మనోజ్ నటించడం లేదు. అహం బ్రహ్మాస్మి అనే చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అయితే భూమా మౌనికతో వివాహం తర్వాత మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి