Mokshagna Teja : మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటో షూట్ వీడియో విడుదల.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
Mokshagna Teja : నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీకి సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కాని దానిపై క్లారిటీ అయితే రావడం లేదు. ఇప్పుడు , అప్పుడు అంటూ ప్రచారాలు సాగుతున్నాయే కాని పూర్తి క్లారిటీ రావడం లేదు. అయితే ఆ మధ్య బాలయ్య ఓ సినిమా ఈవెంట్‌లో తన కొడుకు త్వరలోనే ఇండస్ట్రీకి అడుగుపెడతాడని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని అర్ధమైంది. డెబ్యూ మూవీ గురించి ఇంకా క్లియర్ అప్ డేట్ రాలేదు కానీ మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజుకుగా, స్టైలిష్ గా మారిపోయాడు. ఇలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మోక్షజ్ఞ ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు. మోక్షజ్ఞ కొత్త ఫొటోలు చూసి మోక్షజ్ఞ ఎంట్రీ రెడీ అయిందని అందుకే ఇలా తయారయి స్పెషల్ ఫోటోషూట్ చేయించాడని అనుకున్నారు. ఇక తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. దీంతో మోక్షజ్ఞ ఫోటోషూట్ వైరల్ గా మారడంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.
Mokshagna Teja : మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటో షూట్ వీడియో విడుదల.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
ఇక మోక్షజ్ఞ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో లాంచ్ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. మోక్షజ్ఞ సినిమాకు బాలయ్యే నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాని మల్టీ స్టారర్‌గా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేశాడట. బాలయ్య కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాడని సమాచారం. ఇందులో ఒక హీరోగా మోక్షజ్ఞ ఫిక్స్ కాగా.. రెండో హీరోగా నందమూరి నటసింహం బాలకృష్ణను ప్రశాంత్ వర్మ రంగంలోకి దింపనున్నాడని టాక్ నడుస్తుంది.మరి ఈ వార్తలపై క్లారిటీ రానుంది.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.