mouni roy beautiful pics with husband
Mouni Roy : అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు రెచ్చిపోయి తెగ రొమాన్స్ చేస్తున్నారు. ‘నాగిని’ సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. జనవరి 27న ఉదయం మలయాళీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పెళ్లి రోజు మౌనీరాయ్ తెలుపు రంగు పట్టుచీరలో మెరిసిపోగా, సూరజ్ గోధుమరంగు షేర్వాణీలో పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.
వారిద్దరిని చూసి చూడముచ్చటైన జంట అని నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. 2004లోనే సినిమాల్లోకి వచ్చినా నాగిన్ సిరియ్తో బాగా పేరు వచ్చింది. టీవీషోలు, సీరియల్స్ లో సందడి చేసింది. సినిమాల్లోనూ సత్తా చాటుతున్నది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది మౌనీరాయ్. బ్రహ్మస్త్ర, మొగుల్ సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో రోమియో, అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లో నటించారు. తన భర్త సూరజ్ నంబియార్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
mouni roy beautiful pics with husband
భర్త సూరజ్ నంబియార్ బర్త్ డే సందర్భంగా మౌనీరాయ్ వెకేషన్‌లో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిక్స్ లో భార్య భర్తలు ఇద్దరు తెగ రెచ్చిపోతున్నారు. నడి సంద్రంలో ముద్దు ముచ్చటలాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం వీరి పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మౌనీరాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటారు. హ్యాపీ బర్త్ డే సూరజ్, నా జీవితానికి నీవే షైనింగ్ స్టార్. ప్రపంచంలో నీ మాదిరిగా ముద్దుల వర్షం కురిపించే వారు ఉండరు. నీతో గడిపే ప్రతీ క్షణం మధురానుభూతిని పంచుతుంది అని మౌనీ రాయ్ తన సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.