
mounitha is stunned after seeing karthik cooking dishes at anjali house
Karthika Deepam 7 Feb Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్ 7 ఫిబ్రవరి, 2022, సోమవారం ఎపిసోడ్ 1269 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పదే పది రోజుల కార్తీక్ ను, నా బాబును తీసుకొచ్చి మీ ఇంట్లో అడుగు పెడతాను అని మోనిత.. ఆదిత్యతో చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. దాని గురించే ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. మోనిత ఎందుకు అలా అని ఉంటుంది అని శ్రావ్యతో కారులో వెళ్తూ అంటాడు ఆదిత్య. అన్నయ్య వాళ్లు ఎక్కడున్నారో మోనితకు తెలిసిందా అని అనుకుంటాడు ఆదిత్య. నిజంగానే అన్నయ్య వాళ్లు మోనితకు కనిపిస్తే మోనిత వాళ్లు చేసిన మంచి పని ఇదే అవుతుంది అని అంటాడు ఆదిత్య. అలాగైనా అన్నయ్య మనకు దొరుకుతాడు కదా అంటాడు ఆదిత్య.
mounitha is stunned after seeing karthik cooking dishes at anjali house
కట్ చేస్తే.. మోనిత, భారతి.. ఇద్దరూ అంజలి ఊరుకు కారులో బయలుదేరుతారు. తెల్లారేసరికి.. అంజలి ఇంటికి వెళ్తారు. మరోవైపు కార్తీక్, దీప… అంజలి ఇంట్లో వంట పని చేసేందుకు వెళ్తారు. అయితే.. మోనిత, భారతిని కార్తీక్, దీప చూడరు. అట్నుంచి అటే వంట చేయడానికి వెళ్తారు. వంటలు స్టార్ట్ చేస్తారు. అంజలి ఇంట్లో ఖాళీగా ఉండలేక.. మోనిత ఇంటిని డెకరేట్ చేస్తుంటుంది. అయ్యో మీరెందుకు చేస్తున్నారు. పనివాళ్లు ఉన్నారు కదా అంటుంది అంజలి. ఏదో సరదాకు చేస్తున్నాను లెండి అంటుంది మోనిత. ఇంతలో తన తాళిని చూస్తుంది అంజలి. మీకు పెళ్లి అయిందా అని అడుగుతుంది.
దీంతో అయింది.. అంటుంది. మీ వారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది. దీంతో డాక్టర్ అంటుంది. అవునా.. అయితే ఫేమస్ కార్డియాలజిస్ట్ కార్తీక్ మీ వారికి తెలుసా అని అడుగుతుంది మోనితను. దీంతో ఆయనే మా వారు అంటుంది మోనిత. దీంతో షాక్ అవుతుంది అంజలి.
మరి.. మీ వారు మా హాస్పిటల్ కు వచ్చింది చెప్పలేదా అంటుంది. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఆయన ఎప్పుడు వచ్చారు.. మీ హాస్పిటల్ కు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది మోనిత. దీంతో ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి సర్జరీ చేశారు అంటుంది అంజలి.
దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. కార్తీక్ ఈ ఊళ్లో ఉన్నాడా అని అనుకుంటుంది మోనిత. నాకు దొరికావు కార్తీక్. ఇక నిన్ను నేను వదలను అని అనుకుంటుంది మోనిత. వెంటనే కార్తీక్ ను వెతికేందుకు వెళ్దామని అనుకుంటుంది మోనిత.
కానీ.. ఇప్పుడు వద్దు అని ఆపుతుంది భారతి. ఇంతలో అంజలి వచ్చి చాలా పనులు ఉన్నాయి. కొంచెం వంటలు నువ్వు చూసుకోవా భారతి అని అంజలి చెబుతుంది. దీంతో నేను అదే మోనితకు చెబుతున్నాను అంజలి. నేను గెస్టులను చూసుకుంటాను. తనను వంటల సంగతి చూసుకోమ్మని చెప్పా అంటుంది.
దీంతో వంటలు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు మోనిత.. అక్కడికి వెళ్తుంది. అక్కడ కార్తీక్ వంట చేస్తుండగా చూస్తుంది మోనిత. కార్తీక్ ను ఆ పరిస్థితుల్లో చూసి మోనిత షాక్ అవుతుంది. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.