Shobhan Babu : శోభన్ బాబు అంటే ఆ కాలంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆంధ్రా సోగ్గాడిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి శోభన్ బాబు. ఆయన ఓ జానర్ సినిమాలకు బాగా సూట్ అయ్యేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయాలంటే అందరి డైరెక్టర్లుకు ముఖ్యంగా గుర్తుకు వచ్చే పేరు శోబన్ బాబు మాత్రమే.
అంతలా ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. ఇక ఒ సినిమా విషయంలో శోభన్ బాబు కావాలనే తిరస్కరించారని ప్రస్తుత నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పుకొచ్చారు.తాను నిర్మాతగా మొదటి సినిమా తీసేందుకు శోభన్ బాబును హీరోగా పెట్టి శత్రువు సినిమా చేయాలని అనుకున్నారంట. కానీ దీన్ని శోభన్ బాబు తిరస్కరించడంతో చివరకు వెంకటేష్ తో తీసి సక్సెస్ సాధించారంట.
అయితే ఇంత మంచి మూవీని శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఉందని ఎమ్మెస్ రాజు చెప్పుకొచ్చారు. తాను నిర్మాత కావడం శోభన్ బాబుకు ఇష్టం లేదని అందుకే వేరే ఏదైనా బిజినెస్ చేసుకోమంటూ సలహాలు ఇచ్చారంట. ఒకవేళ శత్రువు మూవీ ప్లాప్ అయితే మనస్పర్ధలు వస్తాయంటూ చెప్పారంట. కానీ ఎమ్మెస్ రాజు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోక వెంకటేష్ తో తన మూవీ చేపించారంట. అనూహ్యంగా ఆ మూవీ సక్సెస్ సాధించిది.
ఈ మూవీని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేయగా రాజ్ కోటి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. ఇలా తాను అనుకున్నది సాధించారంట ఎమ్మెస్ రాజు. ఇక ఇదే సినిమాతో వెంకటేశ్ తిరగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీతోనే రాజు నిర్మాతగా పరిచయం అయ్యారు. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. తన కెరీర్‌ను శోభన్ బాబుతో స్టార్ట్ చేద్దామనుకుని చివరకు వెంకటేశ్‌తో చేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.