
నభా నటేష్ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుందేమో అని టాక్ మొదలైంది. నభా నటేష్ లాంటి హాట్ బ్యూటీకి సరైన బ్లాక్ బస్టర్ పడాలేగాని వరసగా యంగ్ హీరోల సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారి కొంతకాలం టాలీవుడ్ ని ఏలుతుంది. కాని లక్ కలిసి రాకపోతే మాత్రం నెటిజన్స్ తో రక రకాల కామెంట్స్ వినాల్సి వస్తుంది. ప్రస్తుతం నభా నటేష్ పరిస్థితి అదేనేమో అని కామెంట్స్ మొదలయ్యాయని అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ హిట్ అందుకున్న నభా నటేష్ కి ఆ సినిమా క్రెడిట్ మాత్రం అంతగా దక్కలేదు.
సినిమా సక్సస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో రాం కే వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా సక్సస్ తర్వాత నభా నటేష్ కి మాస్ మహారాజ రవితేజ్ తో డిస్కోరాజా సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా గనక బ్లాక్ బస్టర్ అయి ఉంటే ఇక నభా నటేష్ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండేది కాదేమో. కాని అనూహ్యంగా నభా నటేష్ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన డిస్కోరాజా డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా చేసింది.
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజైన ఫస్ట్ సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ మీద అందరి దృష్టి పడింది. ఈ సినిమా హిట్ అయితే అయినా నభా నటేష్ స్టార్ తిరుగుతుందని భావించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా నభా నటేష్ గురుంచి మాట్లాడుకునే వాళ్ళు కరువయ్యారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం సాయి ధరం తేజ్ కే వెళ్ళిపోయింది. ఇక త్వరలో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ నభా నటేష్ కి ఎలాంటి సక్సస్ ని ఇస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు నభా నటేష్ నటిస్తున్న నితిన్ సినిమా మీదే ఆశలన్ని పెట్టుకుందట. ఈ సినిమా తో గనక నభా నటేష్ కి పేరు రాకపోతే ఇక ఈ హాట్ బ్యూటీ ని ఐరెన్ లెగ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేర్చేస్తారని చెప్పుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.