Home » Entertainment » Naga Chaitanya Giving Counter To Samantha In That Aspect
Entertainment

Naga Chaitanya : పోటాపోటీ.. ఆ విషయంలో సమంతకు నాగచైతన్య కౌంటర్..!

Authored By
mallesh
The Telugu News | Published on: February 1, 2022, 6:00 pm
Advertisement

Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంతల డైవోర్స్ గురించి అందరికీ తెలుసు. కాగా, విడాకుల తర్వాత సమంత గతంతో పోల్చితే సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటోంది. తనపైన నెగెటివ్ కామెంట్స్ చేసేవారికి, ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయే కౌంటర్స్ ఇస్తూ దూసుకుపోతున్నది. కాగా, తాజాగా సమంతకు నాగచైతన్య ఓ కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ నాగచైతన్య ఏం కౌంటర్ ఇచ్చాడంటే..నాగచైతన్య, సమంత ఇద్దరూ ఫిట్ నెస్ ఫ్రీక్స్ అన్న సంగతి అందరికీ తెలుసు. డైవోర్స్ తర్వాత సోషల్ మీడియాలో సమంత రకరకాల పోస్టులు పెడుతున్న నేపథ్యంలో తాజాగా నాగచైతన్య కూడా సోషల్ మీడియాలో పెస్టు పెట్టేశాడు.

Advertisement

తన ఫిట్ నెస్ వర్కవుట్ వీడియోను షేర్ చేశాడు. అలా తాను కూడా హ్యాపీగానే ఉన్నానని చెప్పకనే నాగచైతన్య సమంతకు చెప్పేశాడని ఈ సందర్భంగా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నాగచైతన్య కేవలం సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ గా తన కెరీర్ పైన ఫుల్ ఫోకస్, కాన్సంట్రేషన్ పెట్టేసి ఆ విధంగా కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారామోనని కొందరు అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.సమంత డైవోర్స్ తర్వాత స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు పాన్ ఇండియా వైడ్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది.

naga chaitanya giving counter to samantha in that aspect

Advertisement

ఈ నేపథ్యంలో తాను కూడా ప్రొఫెషనల్ గా ఎదగాలని నాగచైతన్య ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో ‘లాల్ సింగ్ చద్దా’ ఫిల్మ్ చేసిన నాగచైతన్య.. రాబోయే ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. తెలుగులో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘థాంక్యూ’ చిత్రం చేస్తున్నాడు. ఇక ఇటీవల సంక్రాంతి సందర్భంగా నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అంతకు ముందు ఆయన నటించిన ‘లవ్ స్టోరి’ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి