naga chaitanya indirect comments on Samantha going viral News
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య, సమంతల విడాకుల అనంతరం… వీరిద్దరికీ సంబంధించిన ప్రతీ అంశం వైరల్ అవుతూ వస్తోంది. విడాకులపై వీరివురూ ఎందుకు విడిపోయామనే సంగతి మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. సమంత మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ ఇన్ డైరెక్ట్ గా ఎవరిపైనో విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఆమె తొలిసారిగా విడాకులపై స్పందించింది. తాను ‘విడాకులు తీసుకున్నప్పుడు ఎంతో కుంగిపోయానని ఆ బాధలో చనిపోతానని అనుకున్నట్లు తెలిపింది. తాను చాలా బలహీనమైన వ్యక్తినని భావించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం తాను ఎంత బలంగా ఉన్నానో తెలుసుకుని ఆశ్చర్య పోయినట్లు పేర్కొంది. తాను ఇంత దృఢంగా మారతానని కల్లో కూడా ఊహించలేదని తెలిపింది.
సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు నాగ చైతన్య మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలోని బిట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీరు ఎలాంటి పాత్రలను చేయడానికి ఆసక్తి చూపరు? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నుంచి ఎదురైన ప్రశ్నకు.. చైతు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. తాను అన్నీ తరహా పాత్రలను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అంటూనే.. తాను చేసే సినిమా కానీ, పాత్ర కానీ తన కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదని తేల్చి చెప్పారు. అయితే చైతన్య ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తన మాజీ భార్య సమంతను ఉద్దేశించి అన్నవే అని నెటిజన్లు అంటున్నారు. సామ్ కు నచ్చిన పాత్రలు పోషిస్తున్నందునే ఆమెకు విడాకులు ఇచ్చారా అంటూ సోషల్ మీడియాలో చైతుని ప్రశ్నిస్తున్నారు.
naga chaitanya indirect comments on Samantha going viral News
సమంత గతేడాది నటించిన ఫ్యామిలీ మెన్ సిరీస్ , సూపర్ డీలక్స్ చిత్రాలు సూపర్ హిట్ లుగా నిలిచి ఆమెకు పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పోషించిన పాత్రలు వివాదాస్పదంగా ఉన్నాయి. అక్కినేని కుటుంబం లోని ఓ మహిళ అలాంటి పాత్రలు చేయకూడదని సమంతపై ఒత్తిడి పెంచారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ కారణంగానే ఆమె ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చేసిందని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది లవ్ స్టోరి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నాగ చైతన్య…. థాంక్యూ, బంగార్రాజు బాలీవుడ్ లో అమిర్ ఖాన్ చేస్తోన్న లాల్ సింగ్ చద్దాతో పాటు త్వరలోనే ఓ హారర్ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు సమంత కూడా బాలీవుడ్, హాలీవుడ్ తేడా లేకుండా వరుస బడా చిత్రాలకు సైన్ చేస్తూ దూసుకు పోతోంది.
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
This website uses cookies.