Home » Entertainment » Naga Chaitanya Netizens Trolling On Samantha
Entertainment

Naga chaitanya : సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి మంచి ప‌నిచేసింది.. నెటిజన్ల ట్రోలింగ్..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 17, 2021, 9:01 pm
Advertisement

Naga chaitanya : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్‌లో బన్నీతో సమంత క్రేజీగా డ్యాన్స్ చేసింది. కాగా, ఈ ‘ఊ అంటావా మావా..’ సాంగ్ యూట్యూబ్‌లో ఇంతకు ముందున్న రికార్డులన్నిటినీ తిరగా రాస్తోంది. ఇక ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ఐటెం సాంగ్ చేసినందుకుగాను సమంతపై కొందరు నెటిజన్లు మళ్లీ ట్రోలింగ్ షురూ చేశారు.

Advertisement

Naga chaitanya : నాగచైతన్యతో విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచేసిన భామ..

Naga chaitanya netizens trolling on samantha

నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత సమంత గ్లామర్ డోస్ బాగా పెంచేసిందని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంత వరకు ఓకే.. కానీ, ఇంకో అడుగు ముందుకేసి, ఇక అడ్డు చెప్పువారు ఎవరూ లేరని సమంత రెచ్చిపోతున్నదని పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్యకు డైవోర్స్ ఇవ్వడం మంచిపనేనని అంటున్నారు. ఈ సాంగ్ ‘మీ మగ బుద్ధే వంకర బుద్ధి’ అన్న పదాలపైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

సమంత ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసిన విధానం చూస్తుంటే ప్రొఫెషనలిజం కనబడుతున్నదని కొందరు అంటున్నారు. కాగా, మరి కొందరు మాత్రం ఇంత ఘోరంగా చేసిందేంటని అభిప్రాయపడుతున్నారు. ఇక ‘పుష్ప’ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్నది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా బ్యూటిఫుల్ భామ రష్మిక మందన నటించింది. కీలక పాత్రల్లో ‘మంగళం శ్రీను’ గా సునీల్, ‘దాక్షాయణి’గా అనసూయ భరద్వాజ్ నటించారు. ఇక విలన్ పాత్రను మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ పోషించారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి