Home » Entertainment » Naga Chaitanya Open On Divorce
Entertainment

Naga Chaitanya : తొలిసారి విడాకులపై స్పందించిన నాగ చైత‌న్య‌.. వీడియో..!

Authored By
Sam C
The Telugu News | Updated on: January 12, 2022, 4:03 pm
Advertisement

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉండే నాగ చైత‌న్య‌- స‌మంత అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వీరిద్ద‌రి విడాకుల వ్య‌వ‌హారం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, వారి విడాకుల‌కి కార‌ణం ఏంట‌నే దానిపై ఇప్ప‌టికి చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. సమంతకు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకుంటున్నారని, అబార్షన్ చేయించుకున్నారని.. ఇలా పలు వాదనలు తెరపైకి వచ్చాయి. సమంత పరోక్షంగా ఈ ఆరోపణలకు జవాబు చెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

విడాకుల ద‌గ్గ‌ర నుండి చాలా సైలెంట్‌గా ఉంటున్న నాగ చైత‌న్య తొలిసారి బంగార్రాజు ప్ర‌మోష‌న్ లో స్పందించారు. “అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్… ఆమె సంతోషంగా ఉంది… నేనూ సంతోషంగా ఉన్నాను… ఈ సిట్యుయేషన్ లో ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా ఈ నిర్ణయంతో ఆయన సంతోషంగానే ఉన్నట్టుగా కన్పిస్తోంది.

naga chaitanya open on divorce

Advertisement

Naga Chaitanya విడాకుల‌పై నోరు విప్పిన నాగ చైత‌న్య‌

మ‌రోవైపు స‌మంత కూడా విడాకుల త‌ర్వాత చాలా సంతోషంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. సినిమాలు, షికార్లు, అందాల ఆర‌బోత ఇలా నానా ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత య‌శోద చిత్రంతో బిజీగా ఉంటే, నాగ చైత‌న్య బంగార్రాజు మూవీ ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అంతేకాదు నాగార్జున్, నాగ చైతన్యలు వినూత్నం మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు. చిత్రంలో బంగార్రాజులుగా తండ్రికోడులు ఇద్దరూ ఒకే ఫ్రేంలో ఫిదా చేస్తున్నారని చెప్పొచ్చు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి