Home » Entertainment » Naga Chaitanya Shobita Pic Viral
Entertainment

Naga Chaitanya : విదేశాల్లో క‌లిసి తిరుగుతున్న‌ శోభిత‌ – నాగ చైతన్య‌.. వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు అయిందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: November 25, 2022, 1:00 pm
Advertisement

Naga Chaitanya : స‌మంత నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత వీరిద్దిరికి సంబంధించి ఎన్ని పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. స‌మంత రెండో పెళ్లి చేసుకోబోతుందని, చైతూ కూడా ఓ హీరోయిన్‌తో రిలేష‌న్‌లో ఉన్నాడ‌ని అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. తెలుగు అమ్మాయి శోభిత దూళ్లిపాళ మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందని ఒక‌ టాక్ బయటకు వచ్చింది. అంతేకాదు ఈ ఇద్దరు ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారాలు చేశారు. అయితే ఇది కొంత మంది నిజ‌మని, మ‌రి కొంత‌మంది అబ‌ద్ధాలు అని చెప్పుకొచ్చారు. శోభిత, చైతన్యలకు ఒక కామన్‌ ఫ్రెండ్ ఉండ‌గా,

Advertisement

అతని బర్త్‌ డే పార్టీ సందర్బంగా కొన్నాళ్ల క్రితం వీరిద్దరు కలిశాని,. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. అనంత‌రం చాలా సార్లు ఇద్దరు మాట్లాడుకోవడం.. చాట్ చేసుకోవడం వంటివి జరిగాయని , ఈ సమయంలోనే ఇద్దరు కూడా తమ కెరీర్‌కు సంబంధించిన విషయాలను, పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అంటూ ఒక కొత్త క‌థ‌ల‌ని అల్లారు నెటిజన్స్. అయితే కొద్ది రోజుల క్రితం జోరుగా వీరిద్ద‌రికి సంబంధించి జోరుగా ప్ర‌చారాలు సాగ‌గా, ఇటీవ‌ల కాస్త శాంతించాయి.

naga chaitanya shobita pic viral

Advertisement

Naga Chaitanya : ఎందుకిలా చేస్తున్నారు..!

కాని తాజాగా ఓ ఫోటోని చూపిస్తూ వీరిద్ద‌రు విదేశాల‌లో ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నారంటూ కొంద‌రు పుకార్లు పుట్టించారు. శోభిత – నాగ చైతన్య కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఈ ఫోటో నేపథ్యం చూస్తే ఒక విదేశీ టూర్ లో ఇద్దరూ ఫోటోకి ఫోజు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.. దీంతో శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోని నిశితంగా పరిశీలించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటున్నారు. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫోటోలు ఇలా మార్ఫింగ్ చేశార‌ని కొంద‌రు చెబుతున్నారు. . వాస్తవం ఏదైనా శోభిత, నాగ చైతన్యల ఫోటో మాత్రం ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి