Naga chaitanya talks about samantha
Naga Chaitanya : ఏ మాయ చేశావే చిత్రంలో నటించిన నాగ చైతన్య, సమంత కొన్నాళ్లకు ప్రేమలో పడి ఆ తర్వాత 2017లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అక్టోబర్ 2న విడిపోతున్నట్టు వారు ప్రకటించగా, ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే విడాకుల తర్వాతి నుండి సమంత ఏదో ఒక రూపంలో తమ రిలేషన్ షిప్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తూనే ఉంది. కాని చైతూ ఎక్కడ నోరు విప్పలేదు. బంగార్రాజు మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో చై తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఇది ఇద్దరి సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశాడు.
తాజాగా ఇచ్చిన మరో ఇంటర్య్వూలో చై, సమంత గురించి మరోసారి ప్రస్తావించాడు. తన బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్, కెమిస్ట్రీ సమంతతోనే అంటూ ఆసక్తిగా స్పందించాడు. కాగా ఇంటర్య్వూలో యాంకర్ నాగ చైతన్యతో మీరు నటించిన హీరోయిన్స్‌లలో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో కుదిరిందని ప్రశ్నించింది. దీనికి వెంటనే చై.. ‘బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే సమంతతోనే కుదిరింది’ అని వెంటనే చెప్పేశాడు. అంతేకాక సమంతతో నటించిన మజిలీ చిత్రం తనకు ఇష్టమని కూడా చైతూ చెప్పుకొచ్చాడు.
Naga chaitanya talks about samantha
తండ్రి నాగార్జున చేసే ఆన్ ది స్పాట్ వర్క్ మీరు చేయాలేనిదేమైనా ఉందా? అని అడిగితే బిగ్ బాస్ గురించి చెప్పారు చైతు. బిగ్ బాస్ షోను అన్ ది స్పాట్ ఆయన రన్ చేసే తీరు చూసి చాలా ఆశ్యర్యపోయానని తనలా నేనెప్పుడూ చేయలేనని చెప్పారు. ఆమిర్ ఖాన్‌తో చైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమిర్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి కూడా చైతన్య మాట్లాడుతూ ‘‘ఆమిర్ ఖాన్‌గారితో కలిసి పనిచేసిన క్షణాలను మరచిపోలేను. ప్రతి డిపార్ట్‌మెంట్‌తో ఆయన అంత చక్కగా కలిసి పోతారు. ఆయనకు ప్రతి క్రాఫ్ట్ మీద అంత మంచి పట్టుంది. అలాంటి విషయాలను నేనెప్పుడూ నేర్చుకోవాలనుకుంటాను’’ అన్నారు మన బంగార్రాజు.
Uric Acid : యూరిక్ యాసిడ్ అనేది అనేక ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే పదార్థాల విచ్ఛిన్నం నుండి…
Indian Army : ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ రేంజ్లో నడుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…
Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు…
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్‌లోని స్థావరాలను…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్‌గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
This website uses cookies.