Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగ చైతన్య కొన్ని నెలల క్రితం తాను ఎంతగానో ప్రేమించిన సమంతకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న వీరిద్దరు విడాకులు తీసుకోగా, అప్పటి నుండి సోలోగా లైఫ్ సాగిస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉండగా.. మరోసారి తన పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ టాక్ వినిపిస్తోంది. విడాకులు అయ్యి చాలా నెలలు కావస్తుండడంతో నాగచైతన్య మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అది కూడా ఒక హీరోయిన్‌తో అని కూడా కొందరు నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు.తాజాగా ఈ పుకార్లపై నాగ చైతన్య టీం స్పందించింది. చైతూ రెండో పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ నిరాధారం. అందులో ఎలాంటి వాస్తవం లేదు అని కన్‌ఫాం చేశారు. దీంతో చైతూ రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లకి బ్రేక్ పడ్డట్టు అయింది. తెలుగు సినిమా రంగంలో 70 ఏళ్ల చరిత్రతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన సమంత.. చైతుతో జీవితాంతం కలిసి ఉంటే చరిత్రకు ఎక్కేది. ఆమె పేరు తెలుగు గడ్డపై చిరస్థాయిగా నిలిచి ఉండేది.
కాని ఆమె ఆ ఫ్యామిలీ కోడలిగా నాలుగేళ్లు మాత్రమే కొనసాగింది.గతేడాది అక్టోబర్ 2న చైతు, సమంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకులకు ముందు నాలుగు నెలల నుంచే సమంత బిహేవియర్‌తో పాటు సోషల్ మీడియాలో ఆమె పెట్టకుంటూ వస్తోన్న పోస్టులు చూసే చాలా మంది ఏదో తేడా కొడుతోందన్న సందేహాలు వ్యక్తం చేశారు. చివరకు వారు ఊహించిందే జరిగింది. విడాకుల తర్వాత కూడా ఈ జంటపై అనేకానేక రూమర్లు వచ్చాయి. అయితే చైతు మాత్రం పెద్దగా ఈ విషయంలో రియాక్ట్ కాలేదు. తన పనేదో తాను చేసుకుపోయాడు. అయితే సమంత మాత్రం ఎప్పుడూ ఏదో అర్థం వచ్చేలాగానే పోస్టులు పెడుతూ వచ్చింది.
Ghee In Winter : చలికాలంలో మనం చలిని నుండి రక్షణ పొందడానికి వెచ్చగా ఉండేందుకు మందటి దుస్తులు ధరిస్తూ…
Zodiac Signs : 2025లో గ్రహాల మార్పులు అన్ని రాశుల వారి జీవితంలోని ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం…
Viral Video : పుష్ప్ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఈ…
Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల పరంగా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ అమ్మడు ఫోటో…
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో…
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
This website uses cookies.