Home » Entertainment » Naga Chaitanya Visits National War Memorial In Laal Singh Chaddha Promotions
Entertainment

Naga Chaitanya : అదొక అందమైన అనుభవం!.. నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 10, 2022, 8:20 pm
Advertisement

Naga Chaitanya : నాగ చైతన్య ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రమోట్ చేసేందుకే దేశమంతటా తిరిగేస్తున్నాడు. ఈ క్రమంలోనే నార్త్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. నార్త్‌లోని కొన్ని ఫేమస్ ప్లేసులను చుట్టేస్తున్నాడు. అలా ఆమిర్ ఖాన్‌తో కలిసి నాగ చైతన్య తిరిగేస్తున్నాడు. మొన్నటి వరకు హైద్రాబాద్‌లో తిరిగారు. ఆ తరువాత చెన్నైలో చక్కర్లు కొట్టేశారు. ఈ సినిమాను సౌత్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే నాగ చైతన్యకు విడాకులు, సమంత వ్యవహారం, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు వర్షంలా కురిశాయి.

Advertisement

వాటికి కొన్ని సార్లు స్పందించాడు. ఇంకొన్ని సార్లు ఘాటుగా స్పందించాడు. విడాకులు అయి 10 నెలలు కావొస్తుంది.. ఇంకా అవే ప్రశ్నలా? మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? విడాకులు జరిగాయ్ ఎవరి పని వారు చేసుకుంటున్నాం.. మేం దాన్ని మరిచిపోయాం.. ముందుకు వెళ్తున్నాం.. మీరు మాత్రం వాటినే పట్టుకుని వేలాడుతున్నారా? అన్నట్టుగా అసహనం వ్యక్తం చేశాడు నాగ చైతన్య. ఇక నాగ చైతన్య మాత్రం ఈ ప్రశ్నలతో చాలా విసిగిపోయాడని అర్థమవుతోంది.తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే.. పర్సనల్ లైఫ్ హెడ్డింగ్‌లో ఉంటోందని, అందరికీ దాని మీదే ఇంట్రెస్టింగ్‌గా ఉందని కౌంటర్లు వేశాడు.

Naga Chaitanya Visits National war memorial in Laal Singh Chaddha Promotions

Advertisement

అలా నాగ చైతన్య ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాను ప్రమోట్ చేస్తూ ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ ముందుకు పోతోన్నాడు. ఆయన నటించిన థాంక్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టేసింది. దాంతో మళ్లీ వెనక్కి పడ్డట్టు కనిపిస్తోంది. ఇక తాజాగా నాగ చైతన్య న్యూడిల్లికి వెళ్లాడు.అక్కడ అమరవీరుల స్మారక స్థూపాన్ని దర్శించుకున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎంత అందమైన అనుభవం అంటూ అక్కడి విశేషాలను పంచుకుంటూ నాగ చైతన్య పోస్ట్ వేశాడు. ఈచిత్రం ఆగస్ట్ 11న రాబోతోంది. ఆ తరువాత నాగ చైతన్య కెరీర్ బాలీవుడ్‌లో ఎలా ఉంటుందో తెలుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి