nagarjuna bangarraju movie latest updates
Nagarjuna : టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు, అక్కినేని నాగార్జున కుటుంబానికి గత కొద్ది రోజులుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 60 సంవత్సరాల వయస్సు దాటినా నాగ్ ఓ వైపు వరుస సినిమాలతో, మరోవైపు బిగ్ బాస్ షోతో నిత్యం బిజీగా గడుపుతున్నారు. అయితే నాగ్ కు సినిమాల పరంగా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ దొరకడం లేదు. నాగ్ తో పాటు ఆయన పెద్ద కొడుకు నాగ చైతన్యకు అతని భార్య నుంచి విడాకుల రూపంలో చిక్కుల్లో పడ్డారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు పై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.నాగ్ నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా అనంతరం… ఆయన యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు.
దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటికి అనుగుణంగా దర్శకుడు చైతూ – కృతి పాత్రల నిడివిని కూడా పెంచి దీన్నో మల్టీస్టారర్ సినిమాగా రూపు దిద్దుతున్నారు. ఈ కారణంగా సినిమాకు ముందు అనుకున్న దాని కంటే అధిక బడ్జెట్ అవడంతో నాగ్ కంగారు పడుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కరోనా కారణంగా జరిగిన నష్టంతో పాటు ఈ సినిమాకు ఇప్పటివరకు బడ్జెట్ 50 కోట్లకు చేరుకుందని సమాచారం. గత కొన్ని ఏళ్లుగా హిట్లు లేక సతమతమవుతున్న నాగ్… ప్రస్తుతం ఈ సినిమా అంత బడ్జెట్ ను తిరిగి రాబడుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
nagarjuna bangarraju movie latest updates
సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు అనే చిత్రానికి కల్యాణ్ కృష్ణనే దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
This website uses cookies.