Home » Entertainment » Nagarjuna Class To Amardeep In Bigg Boss House
Entertainment

Bigg Boss Telugu 7 : నాగార్జున ముందు ఎర్రిపుష్పం అయిన అమర్‌దీప్.. ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నాడు.. ఎలిమినేట్ చేసేయండి అంటున్న జనాలు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 8, 2023, 10:00 am
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. కానీ.. వాళ్లలో ఎర్రిపుష్పం ఎవరు అంటే టక్కున అమర్ దీప్ పేరు చెబుతున్నారు జనాలు. అసలు ఈయన బిగ్ బాస్ హౌస్ కు ఎందుకు వచ్చాడో.. ఏం మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మస్త్ షేడ్స్ ఉన్నయి మనోడిలో. జనాలు అయితే అమర్ దీప్ ను చూడలేకపోతున్నారు. నాగార్జున గారు అమర్ దీప్ ను ఎలిమినేట్ చేసేయండి అంటూ వేడుకుంటున్నారు. ఈ వారం అమర్ దీప్ ను ఎలిమినేట్ చేసేయండి.. ప్రశాంతంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అంటున్నారు. నిజానికి.. బిగ్ బాస్ హౌస్ లో స్టార్ మా బ్యాచ్ అంటూ ఒకటి ఫామ్ అయింది. ఆ బ్యాచ్ నుంచి ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లలో అందరూ లేడీ కంటెస్టెంట్లే. ఇప్పటి వరకు ఒక్క మగ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కాలేదు. అందుకే ముందు అమర్ దీప్ ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటున్నారు.

Advertisement

సందీప్ మాస్టర్, ప్రియాంకతో కలిసి అమర్ దీప్ ఆట ఆడుతున్నాడు. వాళ్లు ఏం చెబితే అది చేస్తున్నాడు కానీ.. ఇప్పటి వరకు తన సొంతంగా మాత్రం ఆట ఆడటం లేదు. అందులోనూ తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. బొక్కలో జడ్జిమెంట్.. తొక్కలో సంచాలక్ అంటూ హౌస్ లో మాట్లాడిన మాటలపై వీకెండ్ లో నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు. ఏంటి అమర్ దీప్.. నువ్వు మాట్లాడే పద్దతి మార్చుకో.. నువ్వు సంచాలక్ గా ఉన్న విషయం మరిచిపోతున్నావు. నీ నిర్ణయాలు సరిగ్గా లేవు. ప్రశాంత్ ని మేకప్ వేసినా వేయకపోయినా వాడి ముఖం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అంటూ మాట్లాడావు.. ఇదేనా నువ్వు చేసే పని అంటూ నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. దీంతో అమర్ దీప్ కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బయట జనాలు ఏమైతే అమర్ దీప్ గురించి అనుకుంటున్నారో నాగార్జున కూడా సీరియస్ అయి అదే చెప్పాడు. దీంతో ఇక నుంచి తనను తాను మార్చుకుంటా అని అమర్ దీప్ మాటిచ్చాడు.

#image_title

Advertisement

Bigg Boss Telugu 7 : ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్నది ఎవరు?

ఈవారం ఎలిమినేషన్ లిస్టులో డేంజర్ జోన్ లో ఉన్న వాళ్లలో శుభశ్రీ, అమర్ దీప్, తేజ ఉన్నారు. యావర్, శివాజీ, గౌతమ్, ప్రియాంక వీళ్లు టాప్ లో ఉండటంతో.. అమర్ దీప్, శుభశ్రీ, తేజలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే.. శుభశ్రీ ఎలిమినేట్ అయిందని ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి.. తనే ఎలిమినేట్ అయిందో లేదో తెలియాలంటే ఇంకొంత సేపు వెయిట్ చేయాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి