Home » Entertainment » Nagarjuna Comments On Pawan Kalyan In Bangarraju Release Press Meet
Entertainment

Nagarjuna : నాగార్జున వేసిన ఆ పంచ్‌ పవన్‌ కళ్యాణ్‌ కేనా.. నాగార్జున అసలేమన్నాడంటే!

Authored By
Himanshi
The Telugu News | Published on: January 6, 2022, 5:40 pm
Advertisement

Nagarjuna : నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా ను ఈనెల 14 న సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి బంగార్రాజు టీమ్‌ మీడియా సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో బంగార్రాజు సినిమా విడుదల గురించి నాగార్జున మాట్లాడాడు. తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సంక్రాంతికి మా బంగార్రాజు ఎంటర్‌ టైన్ చేస్తాడు అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. ఇక బంగార్రాజు ప్రెస్ మీట్‌ లో నాగార్జున కు అంతా అనుకున్నట్లుగానే ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయమై ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న కు నాగార్జున ఇచ్చిన సమాధానం కాస్త వివాదం అయ్యింది.

Advertisement

ఆయన్ను సమర్థించే వారు కొందరు ఉన్నా విమర్శిస్తున్న వారు ఎక్కువ మంది అయ్యారు. ఇండస్ట్రీలో అందరిది ఒక దారి అయితే నాది మరో దారి అన్నట్లుగా ఆయన వ్యవహరించడం.. మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ చాలా మంది ఆయన్ను నేరుగానే విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన వారిలో కొందరు కూడా నాగార్జున విషయమై పెదవి విరుస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి నాగ్‌ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున ఏమన్నాడంటే.. టికెట్ల రేట్ల విషయంలో నాగార్జున మాట్లాడుతూ ఏపీలో ఉన్న సినిమా థియేటర్ల టికెట్ల రేట్లు నా సినిమాకు సరి పోతాయి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

nagarjuna comments on pawan kalyan in bangarraju release press meet

Advertisement

Nagarjuna : నాగార్జున బంగార్రాజుకు పవన్‌ అభిమానులతో ముప్పు తప్పదా?

నా బడ్జెట్‌ సినిమాలకు నా మార్కెట్‌ కు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్ల ఇష్యూ ఇబ్బంది కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఇండస్ట్రీ పరువు గాలి తీసినంత పని చేశాడు. ఇంకా ఒక ప్రశ్నకు సినిమా వేదికలపై రాజకీయాలు నేను మాట్లాడను.. మాట్లాడటం సబబు కాదు అన్నట్లుగా నాగార్జున వ్యాఖ్యలు చేశాడు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు అంటూ నాగార్జున వేసిన పంచ్ ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ కే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పవన్‌ ఈ మద్య కాలంలో అన్ని సినిమా కార్యక్రమాల్లో కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు.

రాజకీయ సభల్లో సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. కనుక నాగార్జున ఇండైరెక్ట్‌ గా పవన్ కళ్యాణ్ ను విమర్శించాడు అంటూ పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగార్రాజు సినిమా కు ఆ ప్రభావం ఉంటుందంటూ ఇండస్ట్రీ లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున మరియు నాగ చైతన్య లు కలిసి నటించిన బంగార్రాజు సినిమా లో రమ్యకృష్ణ మరియు కృతి శెట్టి లు నటించారు. ఫరియా అబ్దుల్లా తో పాటు ఇంకా పలువురు హీరోయిన్స్ ఈ సినిమా లో స్పెషల్‌ రోల్స్ లో కనిపించారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి