Nagarjuna : వామ్మో.. టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా.. అదేంటంటే..!
Nagarjuna : కింగ్ నాగార్జున ఒకప్పుడు మన్మథుడిగా అమ్మాయిల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన హీరోయిన్స్‌తో ఎక్కువగా ఎఫైర్ పెట్టుకున్నాడనే ప్రచారం కూడా ఉంది. నాగార్జున మాత్రమే ఇలాంటి రూమర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ టబుతో నాగ్ కెమిస్ట్రీ బాగుండడంతో ఆఫ్ స్క్రీన్ కూడా వీరిపై ఎన్నో ప్రచారాలు సాగాయి. వాటిపై నాగార్జున ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టబు గురించి ఓ ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ..టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. అమల దగ్గరుండి టబుకు ఇల్లు కట్టించింది. వాళ్లిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలామందికి తెలియనిది ఏంటంటే టబు హైదరాబాద్ అమ్మాయి. అలా పరిచయం అయ్యింది అని అన్నారు.
టబు నా ఫేవరెట్ హీరోయిన్, ఇష్టమైన కో వర్కర్ ఎవరంటే టబు అనే చెప్తాను. ఇప్పటికీ హైదరాబాద్ వస్తే ఇంకెక్కడికీ వెళ్లదు. మా ఇంట్లోనే ఉంటుంది. నాన్నకు కూడా తనంటే అంతే ఇష్టం అని టబు తనతో పాటు తన ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ అనేలా నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే టబుకి నాగార్జున ఓ ముద్దు పేరు కూడా పెట్టాడట. ఆ విషయాన్ని టబు బయటపెట్టింది. పెద్ద ఈవెంట్‌లో ఇండస్ట్రీ మొత్తం ఉన్న ఈవెంట్‌లో టబు పాల్గొని తెలుగు ఇండస్ట్రీ గురించి, తన కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్ గురించి ఆమె మాట్లాడింది. కూలీ నెంబర్ 1`తో తన కెరీర్ ప్రారంభమైందని తెలిపింది. ఈ సందర్భంగానే పండు అనే పేరుని ఇచ్చినందుకు నాగార్జునకి థ్యాంక్స్ అని తెలిపింది టబు. అంటే టబుకి పండు అనే ముద్దు పేరు పెట్టాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Nagarjuna : వామ్మో.. టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా.. అదేంటంటే..!
దీంతో టబు మాటలకు ఈవెంట్ మొత్తం అరుపులతో గోల చేయడం విశేషం. కృష్ణవంశీ టబుని నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం ఎంపిక చేశాడు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో నాగార్జున రొమాన్స్ కి టబు అందం తోడు కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇద్దరు కలిసి వెండితెరపై రచ్చ చేశారు. అలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో ఇద్దరి మధ్య రిలేషన్ కూడా బిల్డ్ అయ్యిందనే వార్తలు వచ్చాయి.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.