Home » Entertainment » Nagarjuna Open Up About Naga Chaitanya Divorce Issue
Entertainment

Nagarjuna : నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల విష‌యంలో నా ఫ్యామిలీని అలా అన‌డం బాధించింది: నాగార్జున‌

Authored By
Sam C
The Telugu News | Published on: January 22, 2022, 5:15 pm
Advertisement

Nagarjuna : నాగ చైత‌న్య‌- స‌మంత విడాక‌లు తీసుకొని మూడు నెల‌లు పైనే అవుతున్నా కూడా వారి విడాకులకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. విడాకుల త‌ర్వాత స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్ పోస్ట్‌లు పెడుతుండ‌గా, వాటిపై నెటిజ‌న్స్ భిన్న‌మైన కామెంట్స్ చేస్తున్నారు. చై-సామ్‌ విడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ.. యూట్యూబ్‌లో పలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. సమంత బోల్డ్‌ పాత్రలు చేయడం నాగార్జున, నాగచైతన్యలకు నచ్చలేదని, ఆమెకు షరత్తులు విధించడంతో విడిపోవాల్సి వచ్చిందని.. ఇలా ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Advertisement

Nagarjuna : ప‌ళ్లున్న చెట్టుకే రాళ్లు..

గ‌త కొద్ది రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌పై నాగార్జున ఆంగ్ల మీడియా ద్వారా స్పందించారు. స‌మంత నాగచైత‌న్య‌ల విడాకుల విష‌య‌మై వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందిస్తూ.. ‘‘కావాల‌నే కొంత మంది ఇలాంటి చెత్త వార్త‌లు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌కు వేదిక‌గా మారుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నేను ప‌ట్టించుకోను. పండ్లు ఉన్న చెట్టుకు రాళ్ల‌నే విష‌యాన్ని బ‌లంగా న‌మ్ముతాను.

nagarjuna open up about naga chaitanya Samantha divorce issue

Advertisement

అందుకే నా గురించి జ‌రిగే ప్ర‌చారాల‌పై స్పందించ‌ను. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం, న‌న్ను ఎంతో బాధించింది’’ అంటూ నాగార్జున ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ఇదే విష‌య‌మై నాగ‌చైత‌న్య సైతం మాట్లాడుతూ.. అలాంటి వార్త‌లు నేను ప‌ట్టించుకోను అని సింపుల్‌గా చెప్పేశారు. ఇక ఇదిలా ఉంటే స‌మంత రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా నుండి విడాకుల అనౌన్స్‌మెంట్ పోస్ట్ డిలీట్ చేసింది. దీంతో అంద‌రు స‌మంత .. చై చెంతకు చేరుతుందంటూ జోస్యాలు చెబుతున్నారు. కాగా, 2017లో ప్రేమవివాహంతో ఒక్కటైన సామ్‌-చై జంట.. గతేడాది అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత ఇద్దరూ.. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి