
Bigg Boss 8 Telugu : మణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్..ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవరో కాదు..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ప్రతి వారం కూడా ఎలిమినేషన్స్ జరుగుతుండగా, అన్నీ కూడా ఫెయిర్ ఎలిమినేషన్స్ అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటింగ్‌లో తక్కువ ఉన్న కంటెస్టెంట్స్‌ను మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరుగా ప్రతి వారం హౌజ్ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే కొత్తగా 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు ఐదో వారం రెండు సార్లు ఎలిమినేషన్స్ నిర్వహించారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మిడ్ వీక్ ఎవిక్షన్‌లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు.ఇక ఇదే ఐదో వారం వీకెండ్‌లో నైనిక ఎలిమినేట్ అయింది. నైనిక ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ శనివారం (అక్టోబర్ 5) పూర్తి అయింది. ఇవాళ్టీ (అక్టోబర్ 6) ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు. కానీ, ఈపాటికే నైనిక ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఢీ షో ద్వారా పాపులర్ అయిన నైనిక ఎలిమినేషన్ నేడు చూపించనున్నారు. నైనిక ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 ఈవెంట్‌తో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హోజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.
Bigg Boss 8 Telugu : మణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్..ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవరో కాదు..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 34వ రోజు సరదాగా సాగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ఆయన్ని నాగార్జున వేదికపైకి పిలిచి మాట్లాడారు. మణికంఠ ఏడుపు గురించి క్లాస్ పీకుతూ ఎపిసోడ్ ని ప్రారంభించారు. హౌస్ మేట్స్ చేత చిన్న గేమ్ ఆడించారు నాగార్జున. ప్రతి ఒక్కరు మిగిలిన వారిలో ఇద్దరినీ ఎంచుకుని వారిలో ఉన్న జెలసీ, విసిగించడం లాంటి బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి. మణికంఠ అయితే తాను ఎవరిని జడ్జ్ చేయనని.. ఎందుకంటే తనలోనే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని ఏడ్చేశాడు.ఇక తనతో పాటు వేదికపై ఉన్న ఆదిత్యని పంచ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తావు అని నాగ్ అడగగా.. యాష్మి, మణికంఠ పేర్లని ఆదిత్య తెలిపాడు. ఎందుకంటే యాష్మి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆదిత్య సూచించాడు. అదే విధంగా మణికంఠ కూడా గేమ్ లో చాలా ఇంప్రూవ్ కావాలని.. నిన్ను నీవు నిరూపించుకోవాలని ఆదిత్య సూచించాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.