Home » Entertainment » Naveen Polishetty Anchor Suma Shock On Naveen Polishetty Comment
Entertainment

Naveen Polishetty : అలా చెప్పడంతో సుమ షాక్.. నవీన్ పొలిశెట్టి మామూలోడు కాదు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 21, 2021, 7:50 pm
Advertisement

Naveen Polishetty : బుల్లితెరపై యాంకర్ సుమకు పంచ్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఎవ్వరైనా సరే.. ముందు ఎవ్వరు ఉన్నా సరే సుమ కౌంటర్ వేస్తే నోరు మెదపలేరు. అందుకే ఆమె ఒంటి చేత్తో పెద్ద పెద్ద ఈవెంట్‌లన అవలీలగా నడుపుతుంది. ఫ్యాన్స్ చేసే గోలను కూడా తన సెటైర్లతో సైలెంట్ అయ్యేలా చేస్తుంటుంది. అలాంటి సుమను ఒకే ఒక్క మాటతో షాక్ అయ్యేలా చేశాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా జాతి రత్నాలు యూనిట్ సుమ క్యాష్ షోలో వచ్చింది.

Advertisement

Anchor Suma Shock On Naveen Polishetty Comment

జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా, నిర్మాత ప్రియాంక దత్, దర్శకుడు అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టి వచ్చారు. ఇక ఈ టీంతో సుమ సందడి చేసింది. అందరూ కలిసి నవీన్ పొలిశెట్టిని బాగానే ఆడేసుకున్నారు. సుమ ఏదో ప్రశ్న అడిగితే.. నాకు గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టమని హీరోయిన్ సమాధానం చెప్పడం.. ఆ విషయం ముందే చెబితే ఉంచేవాడిని కదా అని తన క్లీన్ షేవ్‌ను చూపించేశాడు నవీన్ పొలిశెట్టి.

Advertisement

Naveen Polishetty : అలా చెప్పడంతో సుమ షాక్..

ఈ మధ్య నీకు పాజిటివ్ లాంటిది ఏమీ రాలేదు కదా? అని నవీన్ పొలిశెట్టిని సుమ అడిగేసింది. పొద్దున్నే అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. హా పొద్దున్నే అని సుమ ఆరా తీయగా.. పొద్దున్నే కరోనా వచ్చిందని చెబుతున్నాడంటూ డైరెక్టర్ కౌంటర్ వేశాడు. అలా అనడంతో సుమతో పాటు అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి జాతిరత్నాలు టీం ఇలా తమ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి