navya swamy always busy with phone
Navya Swamy : బుల్లితెరపై నవ్య స్వామికి ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఆమె కథ సీరియల్‌తో రవి కృష్ణ, నవ్యస్వామి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్‌తో నవ్య స్వామి ఫేట్ మారిపోయింది. రవికృష్ణ, నవ్యస్వామి జోడిపై లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. సీరియల్‌లో కెమిస్ట్రీ కుదరడం, ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ రొమాన్స్ చేయడంతో అందరూ ఫిదా అయ్యారు.ఈ జంట సీరియల్ లోనే కాదు, రియల్ లైఫ్‌లోను తెగ సందడి చేస్తుంటారు. ఓసారి ఏకంగా అందరి ముందే నవ్యస్వామికి రవి కృష్ణ ముద్దు పెట్టేశాడు. అలా అప్పటి నుంచి ఈ జంట మీద రూమర్లు రావడం ప్రారంభించాయి.
ఇక ఈ ఇద్దరికీ ఆమె కథ సెట్‌లోనే కరోనా కూడా సోకింది. ఆ సమయంలో ఈ ఇద్దరూ కూడా చాలా కష్టాలను అనుభవించారు.కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది నవ్య స్వామి. నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌లో నటించింది. ఇక తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుందని టాక్.
navya swamy always busy with phone
డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చింది నవ్య స్వామి. ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత ‘వాణీ రాణీ’, ఆహ్వానం వంటి సీరియల్స్ లో చేసింది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ రాత్రి ఏడు గంటల సమయంలో ఫోన్‌లో మునిగిపోయింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా, ఎప్పుడు ఫోన్‌లోనే ఉంటావా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం ఢీ 14లో సందడి చేస్తుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.