Navya Swamy Enjoys at thailand beach
Navya Swamy : బుల్లితెరపై నవ్యస్వామి అందాలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఒకప్పుడు నవ్యస్వామి అంటే బుల్లితెరపై అంత క్రేజ్ ఉండేది. ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది. కానీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆమె కథ అనే సీరియల్‌లో నవ్యస్వామి, రవికృష్ణతో కలిసి నటించింది. ఇక ఈ ఇద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లే ఇంత ఫేమస్ అయింది. ఇక ఇద్దరికీ కరోనా సోకడం, అది కూడా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మొదటి సారిగా నవ్యస్వామికే కరోనా సోకడంతో మరింతగా వార్తల్లోకి ఎక్కింది. కరోనా సోకడం అంటే మహాపాపంగా చూసిన ఆ రోజుల్లో నవ్యస్వామికి నరకం చూపించేశారు.
అలా రవికృష్ణకు కూడా కరోనా సోకింది. మొత్తానికి కరోనా నుంచి బయటపడింది. అయితే పలుమార్లు టెస్టులు చేయించుకున్నా కూడా పాజిటివి పాజిటివ్ అని వస్తూనే ఉందట. అలా పదిహేను రోజులు నరకం చూశానని, చివరకు కరోనా నెగెటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నానంటూ నవ్యస్వామి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నవ్య స్వామి మాత్రం ఫుల్ చిల్ అవుతోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మామూలుగా వీకెండ్ వస్తే తన ఫ్రెండ్స్ హరితేజ, కస్తూరీ సీరియల్ ఐశ్వర్యలతో కలిసి హల్చల్ చేస్తుంటుంది.
Navya Swamy Enjoys at thailand beach
హరితేజ భర్త దీపక్ రావు కన్నడిగుడు కావడంతో మరింత క్లోజ్ అయ్యామంటూ నవ్యస్వామి చెబుతుంటుంది. అయితే ఈ మూడు ఫ్యామిలీలు వీకెండ్‌లో నానా హంగామా చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ మూడు ఫ్యామిలీలు థాయ్‌లాండ్ చెక్కేశాయి. గత వీకెండ్‌లోనే అక్కడికి జంప్ అయినట్టున్నారు. మొత్తానికి థాయ్ లాండ్‌లో నవ్యస్వామి అందాల విందు చేస్తోన్నట్టుంది. తెరపై ఎప్పుడూ కూడా నవ్యస్వామి అందాలను ఆరబోయలేదు. పద్దతిగానే ఉంటుంది. కానీ నవ్యస్వామి మాత్రం ఇప్పుడు థాయ్‌లాండ్‌లో దుమ్ములేపుతోంది. అందాల ప్రదర్శనకు తెర లేపింది. బీచ్‌లో నవ్య స్వామి పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.