
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో ఉప్పు ప్యాకెట్ ఖరీదు రూ.50 వేలా.. నయని పావని ఎందుకలా ఏడ్చింది..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాకతో బిగ్ బాస్ హౌజ్ రక్తి కడుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్స్‌తో కూడా అప్పుడే గొడవలు మొదలు అయ్యాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఆరో వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో యష్మీ గౌడ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. అయితే, రాయల్ క్లాన్స్ (వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్)లో ఇమ్యునిటీ పవర్ ఉపయోగించి ఒకరిని నామనేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు. వారిని ఓజీ క్లాన్ నామినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ చెప్పాడు.
దాంతో నయని పావనికి స్టార్ ఇమ్యునిటీ పవర్ ఇచ్చి సేవ్ చేశారు మిగతా రాయల్ క్లాన్ మెంబర్స్. అయితే, గత సీజన్ (బిగ్ బాస్ తెలుగు 7)లో నయని పావని వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన తొలి వారమే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. మరోసారి అలా జరగకూడదని, రిస్క్ తీసుకోవడం ఎందుకుని తన పాయింట్ చెప్పాడు గౌతమ్. దాంతో మిగతా వారంతా అంగీకరించారు.ఇక జబర్దస్త్ అవినాష్‌తో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ గురించి డిస్కషన్ పెట్టింది కిర్రాక్ సీత. ఇంతలో నయని పావని అక్కడికి వచ్చింది. వారికి ఎదురుగా టేస్టీ తేజ, మెహబూబ్ వాళ్లు ఉన్నారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వారమే నయని ఎలిమినేట్ కావడంతో ఎవరు నామినేట్ చేశారనని ఆమెను సీత అడిగింది. ఇలా డిస్కషన్ సాగుతున్న సమయంలో తేజ, నయని పావని మధ్య చర్చ హీటెక్కింది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో ఉప్పు ప్యాకెట్ ఖరీదు రూ.50 వేలా.. నయని పావని ఎందుకలా ఏడ్చింది..!
“నిన్ను బండబూతులు తిట్టారు” రివ్యూవర్లు అని తేజ అన్నాడు. ఎవరన్నారు అని నయని అడిగింది. వెళ్లి చూసుకో అని కాస్తా రూడ్‌గానే మాట్లాడాడు తేజ. కాసేపు సైలెంట్‌గా ఉన్న నయని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అవినాష్, సీత, మెహబూబ్ ఏమైందని ఆరా తీశారు. కానీ, అక్కడి నుంచి వెళ్లిపోయింది నయని. తన బెడ్‌మీదకు వెళ్లి ఎక్కి ఎక్కి ఏడ్చింది. మెహబూబ్, యష్మీ వచ్చి ఓదార్చారు. “నేను మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాననే బాధ సంవత్సరంపాటు పడ్డాను” అని నయని చెప్పింది. ఇక బీబీ సూపర్ మార్కెట్‌లో ఒక్క ఉప్పు ప్యాకెట్ కావాలి. ప్లీజ్ బిగ్ బాస్. ప్లీజ్ మీకు పుణ్యం ఉంటది బిగ్ బాస్ అని నబీల్ చేతులెత్తి వేడుకున్నాడు. దాంతో మిగతా కంటెస్టెంట్స్ నవ్వారు. “మీరు కూడా రిక్వెస్ట్ చేయండి” అని నబీల్ అన్నాడు. దాంతో ఏదో మొక్కుబడిగా రిక్వెస్ట్ చేసినట్లు చూపించారు. ఒక ఉప్పు ప్యాకెట్ ధర 50 వేల రూపాయలు. ఆ డబ్బును విన్నర్స్ ప్రైజ్‌మనీ నుంచి తీసుకోబడుతుంది” అని బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
This website uses cookies.