Nayantara Who Insulted the Rising Star Badly
Nayantara: స్టార్ యాక్ట్రెస్ నయనతార గురించి ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్నిఓ ఊపు ఊపేస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్స్ ప్లాపులతో ఈ బ్యూటీకి సంబంధం లేదు. ఈ విధంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నయన్ పాగా వేసింది. ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటించేందుకు చాలా మంది ఏజ్డ్ హీరోయిన్లు ఉండేవారు. ప్రస్తుతం కొందరు పెళ్లిళ్లు చేసుకుని సెట్ అయ్యారు. శ్రియ, కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా సెటిల్ అయ్యారు. త్రిష కోలివుడ్‌కే పరిమితం అయ్యింది. నటి స్నేహకు ఇద్దరు పిల్లలు.. ఆమె ప్రస్తుతం హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా తల్లి, అక్క పాత్రలు చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త నీరు వచ్చి చేరింది. పాత నీరు వెళ్లిపోయింది.
Nayantara Who Insulted the Rising Star Badly
కొందరు హీరోయిన్లకు చాలా తక్కువ ఏజ్ ఉంటుంది. సీనియర్ హీరోలతో జోడి కట్టేందుకు వారు రెడీగా ఉన్నా ఆడియెన్స్ ఏమనుకుంటారో అని దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నయన్ మాత్రమే అందరూ సీనియర్ హీరోలతో చేసింది. దీంతో మూవీమేకర్స్ సీనియర్ హీరోలతో సినిమా అంటే ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారట.. అయితే, ప్రమోషన్స్‌కు హాజరుకానని ఈ భామ ముందే తెగేసి చెబుతున్నా దర్శక నిర్మాతలు అయిష్టంగానే ఓకే అంటున్నారట..
తాజాగా నయన్ తార మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెల్లెలి క్యారెక్టర్ చేస్తోంది. ఇందులో నయర్ భర్తగా సత్యదేవ్‌ను ఎంచుకున్నారు మూవీమేకర్స్. అయితే, తనతో నటించే అర్హత సత్యదేవ్‌కు లేదని, ఎవరైనా సీనియర్ నటుడిని పెట్టాలని నయన్ కండిషన్ పెట్టిందటని రూమర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే సినిమాలో చిరు తర్వాత పవర్ రోల్ సత్యదేవ్ దే అని దర్శకుడు చెప్పినట్టు తెలుస్తోంది. మళయాలం మూవీ లూసీఫర్‌కు రీమెక్ గాడ్ ఫాదర్.. అందులో మోహన్ లాల్ సిస్టర్ గా మంజువారియర్ యాక్ట్ చేస్తే ఆమె భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషించారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.