Acharya: తప్పదు మరి లాసైనప్పుడు తిరిగిచ్చేయాల్సిందే.. అంటూ నెటిజన్స్ ఆచార్య మేకర్స్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అవును..ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగా మల్టీస్టారర్ ఆచార్య. కెరీర్‌లో 4 బ్లాక్ బస్టర్స్ తీసిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అటు మెగాస్టార్, ఇటు మెగా పవర్ స్టార్ ఉన్నారంటే సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో అని ప్రతీ ఒక్కరు గొప్పగా చెప్పుకున్నారు.కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆచార్య ఒకే ఒక్క షోతో ఫ్లాప్ అని తేల్చేశారు అభిమానులు.
మెగా అభిమానులే ఈ సినిమా చూసి తీవ్ర నిరాశ చెందారంటే, ఇక కామన్ ఆడియన్స్ ఎంతగా డిసప్పాయింట్ అయి ఉంటారో ఊహించుకోవచ్చు. కొంతమందైతే ఇది కొరటాల స్క్రిప్టేనా..ఆయన దర్శకత్వం వహించిన సినిమానేనా..అంటూ సందేహాలను వ్యక్తం చేశారు. అంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా అంటే నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్స్ భారీగా ఖర్చు చేస్తారు.కానీ, దానికి తగ్గట్టుగా గనక లాభాలు రాకపోతే మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించరు. అందుకే, మన హీరోలు సాధ్యమైనంతవరకు నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్‌నుఆదుకునేందుకు ఏమాత్రం వెనకాడరు.
ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు చరణ్ ..తాము తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి సగాని తిరిగి నిర్మాతకు ఇచ్చేయగా..ఆ మొత్తాని మరీ దారుణంగా లాసైన డిస్ట్రిబ్యూటర్స్‌కు సర్దుబాటు చేశారట. దీనిలో భాగంగానే దర్శకుడు కొరటాల శివ కూడా తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో మళ్ళీ సగం రెమ్యునరేషన్ తిరిగిచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్‌కు సపోర్ట్ చేసినట్టు తాజాగా ఇండస్ట్రీ వర్గాల లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దాంతో శ్రీమంతుడు సినిమాలో దర్శకుడు కొరటాల శివ రాసిన డైలాగ్‌ను కాస్త మార్చి లాసైనప్పుడు తిరిగిచ్చేల్సిందే..తప్పదు మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.