Mallemala : మల్లెమాల టీం చేసే టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతీ సారి పిచ్చి వేషాలు వేస్తూ టీఆర్పీని లాగేయాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ టీఆర్పీ స్టంట్లన్నీ కూడా జనాలు పసిగడతారు. మల్లెమాల టీం, శ్రీదేవీ డ్రామా కంపెనీ డైరెక్షన్ల మీద జనాలు విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా కూడా అలాంటి ఓ ట్రిక్కే ప్లే చేశారు. దానిపై జనాలు దారుణంగా ఏకిపారేస్తున్నారు. ఈ టీఆర్పీ స్టంట్లు చాలా చూశామంటూ పోపో పోవయ్యా అని అంటున్నారు. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేయబోతోన్నట్టు చూపించారు. అందులో సడెన్‌గా సెట్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు.
ఇక్కడ హైపర్ ఆది ఎవరు అని అడుగుతారు. వచ్చేటప్పుడు నువ్ ఒకరికి యాక్సిడెంట్ చేశావ్.. చావు బతుకుల్లో ఉన్నాడు అంటూ హైపర్ ఆదిని సదరు పోలీసోడు భయపెట్టేస్తాడు. దీంతో అక్కడి వారంతా కూడా షాక్ అవుతారు. అయితే ఈ స్టంట్‌ను జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూట్యూబ్‌లో కామెంట్లతో మోత మోగిస్తున్నారు. ప్రోమో లాస్ట్ లో జోక్ అదిరిపోయింది పోలీస్ అన్న, పోలీస్ అన్న రూపాయికి చేయమంటే పది రూపాయలకు చేసాడు, మంచి భవిష్యత్తు ఉంది నాన్న నీకు, అది అన్నయ్య కు అసలు డ్రైవింగ్ రాదు ఆ విషయం చాలా సార్లు చెప్పాడు, … నిజంగానే ఆది ఆక్సిడెంట్ చేస్తే, ఆదిని అరెస్ట్ చేస్తే..
ఈ పాటికి న్యూస్ చానెల్స్ వచ్చేది, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్షన్ టీం ..?, సుధీరన్న లేకపోతే ఈటీవీ ఇన్ని టీఆర్పీ స్టెంట్స్ చెయ్యాల్సి వస్తుంది , అదే సుధీరన్న ఉంటే ఆటోమేటిక్‌గా టీఆర్పీ వస్తుంది, పోలీస్ అన్నకి సరిగా… యాక్టింగ్ నేర్పియలేదా?, పోలీస్ వారు 10రూపాయలు యాక్టింగ్ బాగా చేసారు కానీ ఆది కి డ్రైవింగ్ రాదు అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. మొత్తానికి ఇలాంటి పిచ్చి టీఆర్పీ స్టంట్లు మాత్రం ఇక మారేట్టు లేరు. వచ్చే వారం ఇంకా ఎలాంటి స్టంట్లు వేస్తారో చూడాలి. టీఆర్పీ కోసం మరింత దిగజారిపోతోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి హైపర్ ఆది అరెస్ట్ అంటూ చేసిన స్టంట్ మాత్రం దారుణంగా బెడిసికొట్టేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.