Home » Entertainment » Niharika And Chaitanya Jv At Goa
Entertainment

Niharika : గోవాలో మెగా జంట.. భర్తతో నిహారిక రచ్చ

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 23, 2021, 9:30 am
Advertisement

Niharika మెగా జంట నిహారిక, చైతన్య ఎక్కువగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటుంది. వెకేషన్‌లకు వెళ్లడం అంటే ఇద్దరికీ మహా ఇష్టంగా ఉన్నట్టుంది. షూటింగ్‌లంటూ ఆల్రెడీ ఇద్దరూ బాగానే తిరుగుతున్నారు. గత నెలలో అరుకు లోయలో ఎంజాయ్ చేశారు. లంభసింగిలో షూటింగ్ కోసం వెళ్లడంతో చైతన్య కూడా అక్కడికే మకాం మార్చాడు. ఇద్దరూ కలిసి అక్కడే ఎంజాయ్ చేశారు.

Advertisement

Niharika And Chaitanya JV At Goa

అయితే ఈ మధ్య రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో ఈ జంట చక్కర్లు కొట్టింది. అక్కడ పులి వేసిన అడుగులను చూపిస్తూ హింట్ ఇచ్చింది. ఇది ఎవరో చెప్పుకోండి అని పోస్ట్ వేసింది. అది మీ బాబాయ్ పవన్ కళ్యాణ్‌ది అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. మొత్తానికి అలా ఆ జాతీయ పార్కులో ఈ జంట చక్కర్లు కొట్టేసింది.

Advertisement

Niharika గోవాలో నిహారిక, చైతన్య

Niharika Konidela

ఇక ఇప్పుడు వీరి మకాం గోవాకు షిఫ్ట్ అయింది. నిన్న ఉదయం గోవాకు ఈ జంట పయనమైంది. ఇందులో భాగంగా గోవాలో ల్యాండ్ అయిన ఈ జంట ఎంతో సంప్రదాయబద్దంగా రెడీ అయ్యారు. పెళ్లికి రెడీ అవుతున్నాం.. వెడ్డింగ్ సీజన్ అంటూ అసలు విషయం చెప్పింది నిహారిక. తన ఫ్రెండ్ పెళ్లి కోసం గోవాకు నిహారిక వచ్చినట్టు కనిపిస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి