
niharika konidela funny reply on asking phone number
Niharika : మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ కూడా ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య కూడా విబేధాలు వచ్చాయని, విడిపోయారంటూ ఇలా ఏవేవో రాసేశారు. నిహారిక ఇన్ స్టా గ్రాం నుంచి వైదొలగడంతో ఇలాంటి పిచ్చి వార్తలన్నీ పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని చైతన్య తన పోస్టులతో తెలిపేవాడు. అయితే నిహారిక ఒంటరిగా పబ్బు వ్యవహారంలో దొరకడంతో మరింతగా ఈ వార్తలు వేడెక్కాయి. డిప్రెషన్‌లో ఉందని అందుకే ఇలాంటివి చేస్తోందంటూ పబ్ వ్యవహారాన్ని నానా హంగామా చేశారు.
నిహారిక డ్రగ్స్ తీసుకుందా? అనే కోణంలోంచి జనాలు ఆలోచిస్తున్నారు. అలా మొత్తానికి నిహారిక వ్యవహారం మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వార్తకు దారి తీస్తోంది. ఆ పబ్ వ్యవహారం మీద నాగబాబు వివరణ ఇచ్చినా అదంతా సమంజసంగా లేదనే టాక్ వచ్చింది. అయితే నిహారిక మాత్రం కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ వ్యవహారాల్లోంచి బయటకు వచ్చేందుకు విదేశాలకు వెకేషన్‌కు వెళ్లింది. తన భర్తతో కలిసి నిహారిక జోర్డాన్‌కు వెళ్లింది. వారానికి పైగా అక్కడే వెకేషన్‌ను ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.అయితే నిహారిక ప్రస్తుతం మళ్లీ ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్ అయింది. కమ్ బ్యాక్ ఇచ్చిన సమయంలోనూ నిహారిక ఓ పోస్ట్ చేసింది.
Niharika and chaitanya JV In Gym
ఈ మధ్య కాలంలో తాను మూడు విషయాలు నేర్చుకున్నాను అంటూ తన మీద వచ్చిన కాంట్రవర్సీల మీద పరోక్షంగా రియాక్ట్ అయింది. అయితే నిహారిక ఇప్పుడు తన భర్తతో కలిసి జిమ్‌లో కష్టపడుతోంది. ఇక చైతన్య అయితే బీస్ట్ మోడ్‌లోకి మారిపోయాడు. చైతన్య కంటిన్యూగా జిమ్ చేస్తున్నాడు. నిహారిక కూడా భర్తతో పాటే జిమ్‌కు వస్తోంది. తాజాగా తన జిమ్ ట్రైనర్ గురించి చెప్పుకొచ్చారు.తమ జిమ్ ట్రైనర్ కొత్త సెంటర్ ఓపెన్ చేశాడంటూ నిహారిక, చైతన్యలు చెప్పుకొచ్చారు. అతనికి కంగ్రాట్స్ చెబుతూ కొత్త జిమ్ సెంటర్‌ను చూపించారు. ఇక నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. నటిస్తూ నిర్మిస్తూ ఓటీటీల్లో తనకంటూ ఓ మార్క్ చూపిస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.