Home » Entertainment » Niharika Clarity On Divorce Both Of Us Are Separating With Consensus
Entertainment

Niharika : ఏకాభిప్రాయంతోనే ఇద్దరం విడిపోతున్నాం విడాకులపై నిహారిక క్లారిటీ..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: July 5, 2023, 6:48 pm
Advertisement

Niharika : మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఎవరూ కూడా తమను ఇబ్బంది పెట్టవద్దని ఇంస్టాగ్రామ్ పోస్టులో కోరడం జరిగింది. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నట్లు దీన్ని అందరూ గౌరవించాలని.. విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబం మరియు సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 2020లో నిహారిక మరియు భర్త జొన్నలగడ్డ చైతన్యకి వివాహమయ్యింది.

Advertisement

రాజస్థాన్ లోని జైపూర్ లో భారీ ఎత్తున తండ్రి ఈ వివాహం జరిపించారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా గాని ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు ఆన్ ఫాలో చేసుకోవడం జరిగింది. దీంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది నెలల నుండి ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియాలో వార్తలు రావడం జరిగాయి. ఆ సమయంలో ఎవరూ కూడా స్పందించలేదు. పరిస్థితి ఇలా ఉంటే నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో కూడా చైతన్య కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుందని అందరూ డిసైడ్ అయ్యారు. ఈ వేడుకలో ప్రతి చోట నిహారిక ఒక్కతే సింగిల్ గా ఫోటో దిగడం జరిగింది.

niharika clarity on divorce Chaintay

Advertisement

ఈ క్రమంలో తాజాగా ఈ జంట కుకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఆ విడాకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఇద్దరం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ లో నిహారిక స్పష్టం చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి