Home » Entertainment » Niharika Confirms To Be Mother
Entertainment

Niharika : నిహారిక ప్రెగ్నెంటా.. అలా క‌న్‌ఫాం చేసేసిందా?

Authored By
Sam C
The Telugu News | Published on: July 26, 2022, 1:00 pm
Advertisement

Niharika: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల త‌న‌య నిహారిక ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కెరీర్ మంచిగానే కొనసాగుతోన్న సమయంలోనే నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఒక‌వైపు భ‌ర్త బాగోగులు చూసుకుంటూనే మ‌రోవైపు త‌న కెరీర్ ప్లాన్ చేసుకుంటుంది. కెరీర్ ప్రారంభంలో యాంకర్‌గా, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించి పేరు తెచ్చుకున్న నిహారిక.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైంది. తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటివి చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు.

Advertisement

ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తుంది. నిహారిక తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఆ మధ్య ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ప్రస్తుతం ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఆర్యన్ రాజేష్, నిత్యా శెట్టి, నిఖిల్, అనిల్ గీలా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శివ సాయి వర్థన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది మంచి స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తుంది. అయితే నిహారిక ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారింది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.

niharika confirms to be mother

Advertisement

Niharika : త‌ల్లి కాబోతుందా?

పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది. స్టైలిష్ లుక్స్ తో కూడా అందర్నీ ఫిదా చేస్తుంది.ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. రీసెంట్‌గా ఈమె చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌, చిన్న కుమార్తె శ్రీ‌జ‌ల‌తో క‌ల‌సి షాపింగ్‌, బేకరీ, రెస్టారెంట్స్‌కు వెళ్లి సంద‌డి చేసింది. ఆ వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు ప్రెగ్నెంట్ కాబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అందుకు కార‌ణం తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ముగ్గురం అవుతున్నాము అని కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లు ఒక పోస్ట్ షేర్ చేసుకుంది. దీనిని బేస్ చేసుకొని త్వ‌ర‌లోనే నిహారిక త‌ల్లి కానుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి