Home » Entertainment » Niharika Funny Answer To Netigen
Entertainment

Niharika Konidela : నిహారిక‌కి పెళ్లైందా అని నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిన మెగాడాట‌ర్

Authored By
Sam C
The Telugu News | Published on: June 9, 2022, 3:30 pm
Advertisement

Niharika Konidela : మెగా డాట‌ర్ నిహారిక ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా లేదు. ఇప్పుడు నిహారిక తన లుక్కును పూర్తిగా మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నిహారిక ఇప్పుడు తన వెబ్ సిరీస్‌లతోనే కాకుండా సినిమా ప్రమోషన్ల ఈవెంట్లోనూ పాల్గొంటుంది. 777 చార్లీ సినిమా కోసం నిహారిక రంగంలోకి దిగింది. రానా సమర్పణలో వస్తోన్న మూవీ కావడంతోనే నిహారిక ఇలా వచ్చి ఉంటుందేమో. మొత్తానికి హీరో రక్షిత్ శెట్టితో కలిసి ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. ఓ వైపు భర్తతో కలిసి వర్కవుట్లు చేస్తోంది. ఇంకో వైపు వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా ఉంటోంది.

Advertisement

ఈ మధ్యే జోర్డాన్ ట్రిప్ ముగించుకుని వచ్చింది. ఇక వచ్చీ రావడంతోనే నిహారిక వర్కవుట్లలో మునిగింది. తాజాగా నెటిజెన్స్ తుంటరి ప్రశ్నకు అదే తీరులో సమాధానం చెప్పింది నిహారిక‌. తన భర్త వెంకట చైతన్యను ట్యాగ్ చేసిన నిహారిక… నేను సింగిలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇండైరెక్ట్ గా నెటిజెన్ కి నేను సింగిల్ కాదు, ఈయనే నా భర్త అని సమాధానం చెప్పింది. మరో నెటిజన్ నిహారిక ఫోన్ నంబర్ కావాలని అడుగగా, ఇష్… అది చెప్పకూడదంటూ తప్పించుకుంది. సమయస్ఫూర్తితో కూడిన నిహారిక సమాధానాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా నిహారిక కొంత కాలం ఇంస్టాగ్రామ్ కి దూరం అయ్యారు.

Niharika Konidela funny answer to netigen

Advertisement

Niharika Konidela : నిహారిక ఆశ్చ‌ర్య‌పోయే స‌మాధానం..

ఆమె అకౌంట్ డీయాక్టీవ్ అయ్యింది. దీనితో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. తిరిగి నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ యాక్టివ్ లోకి తెచ్చారు. ఆ మధ్య నిహారిక వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా మింక్ అండ్ ఫుడింగ్ పబ్ రైడ్ లో నిహారికను అధికారులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత ఆమె ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వివాదంలో కుటుంబ సభ్యులు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. మొత్తానికి నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ లో నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. నిహారిక కొన్ని వెబ్ సిరీస్లు, చిత్రాల్లో నటిస్తున్నారు. తన సొంత బ్యానర్ లో కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి