Home » Entertainment » Niharika Gets Trolled By Netizens
Entertainment

Niharika : నిహారిక‌ని ఇలా చూసి ముస‌లామె లెక్క ఉన్నావంటూ ఆటాడుకుంటున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: July 18, 2022, 3:30 pm
Advertisement

Niharika : మెగా బ్ర‌ద‌ర్ ముద్దులు కూతురు నిహారిక ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా విమ‌ర్శ‌ల పాల‌వుతుంది. హైదరాబాద్‌లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్‌లో పోలీసులు దర్యాప్తు చేసిన సమయంలో నిహారిక ఉండడంతో ఆ అంశం రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో నిహారిక‌పై దారుణ‌మైన ట్రోలింగ్ జ‌రిగింది. అయితే ప‌బ్ రైడ్ జ‌రిగిన కొన్ని రోజుల త‌ర్వాత నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది. త‌న‌కు సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రీసెంట్ గా తలకిందకు దించుతూ… నవ్వుతున్న ఫోటోను నిహారిక షేర్ చేసింది. ఇందులో నిహారిక ముస‌లావిడ మాదిరిగానే కనిపిస్తుంది. దీంతో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

నిహారిక మాత్రం అవేమి ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫెయిల్యూర్ సాకు చూపి నిహారిక కు త్వరత్వరగా వివాహం చేసేశారు. ఆమె మాత్రం హీరోయిన్ గా ఎదగాలని ఆశపడ్డారు. ఒక మనసు చిత్రంలో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించారు. ఇవేమీ ఆశించిన విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు అందుకోలేకపోయాయి. 2020 డిసెంబర్ లో నిహారిక వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం ఘనంగా నిర్వహించారు. పెళ్ళైనా హీరోయిన్ గా ఎదగాలనే ఆమె కోరిక చావలేదు.

niharika gets trolled by netizens

Advertisement

Niharika : నిహాపై ట్రోలింగ్.

భర్త, అత్తింటివారి అనుమతితో నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం నిహారిక ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. అనసూయ కూడా ఈ సిరీస్లో కీలక రోల్ చేస్తున్నారు. ఇది ప్రకటించి చాలా కాలం అవుతున్నా మరో అప్డేట్ లేదు. ఇక నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఉంది.ఈ బ్యానర్ లో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు నిర్మించడం జరిగింది. తాజాగా ఆమె మరికొన్ని చిత్రాలు, సిరీస్లు తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారు. నటిగా ఎదగాలి అనేది ఆమె అసలు కోరిక. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు దాని కోసం ఎంతో కృషి చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి