Home » Entertainment » Niharika Konidela Chaitanya Shared Intersting Pics
Entertainment

Niharika Konidela : ఆమెకు ఎప్పుడూ అది కావాలి.. నిహారికపై భ‌ర్త చైత‌న్య హాట్ కామెంట్స్‌..!

Authored By
mallesh
The Telugu News | Updated on: December 3, 2021 8:26 pm
Advertisement

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక చైతన్యను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో ఉంది. తనకు నచ్చిన కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తూ నిహారిక ప్రొడ్యూసర్‌గానూ రాణిస్తోంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ అనే వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసింది నిహారిక. ఈ సిరీస్ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. ఈ సంగతులు అలా ఉంచితే నిహారిక ప్రజెంట్ తన హస్బెండ్ చైతన్యతో వెకేషన్‌లో ఉంది.గతేడాది డిసెంబర్ 9న కరోనా టైంలోనే చైతన్యను మ్యారేజ్ చేసుకున్న నిహారిక ప్రజెంట్ యానివర్సరీ ఎంజాయ్ చేస్తోంది.

Advertisement

ఫస్ట్ యానివర్సరీ స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారు నిహారిక దంపతులు. తన భర్త చైతన్యతో కలిసి నిహారిక స్పెయిన్ కంట్రీలోని బార్సిలోనాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చైతన్య నిహారిక ఫొటోలు షేర్ చేశాడు. సదరు ఫొటోల్లో ఇద్దరు కారులో హ్యాపీగా కనబడుతున్నారు. చైతన్య స్కై డైవింగ్ చేస్తాడని, ఆయన్ను తాను ఎంకరేజ్ చేస్తానని నిహారిక పేర్కొంది. అయితే, చైతన్య మాత్రం నిహారిక కూడా చేస్తుందంటూ ఆమె ఫొటోలు షేర్ చేశాడు. తనకు స్కై డైవింగ్ అంటే చాలా భయమని, అందుకే తాను చేయబోనని అంది నాగబాబు కూతురు. ఈ క్రమంలోనే నిహారిక ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉంటుందని, ఆమె ఫోన్‌తో గడుపుతున్న ఫొటోలను షేర్ చేసి చైతన్య కంప్లయింట్ చేశాడు.

niharika konidela chaitanya shared intersting pics

Advertisement

Niharika Konidela : భర్తతో కలిసి ఆ ప్లేస్‌లో ఎంజాయ్ చేస్తున్న నిహారిక..

మొత్తంగా చైతన్య, నిహారిక ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగానే ఫన్నీగా కంప్లయింట్ చేసుకుంటున్నారు. మొత్తంగా తొలి వివాహ వార్షికోత్సవం నిహారిక, చైతన్యలు హ్యాపీగా జరుపుకుంటున్నారు. తనను అస్సలు నిహారిక పట్టించుకోవడం లేదని చైతన్య కంప్లయింట్ చేశాడు. మొత్తానికి నిహారిక చైతన్యలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిరువురు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండటం చూసి నెటిజన్లు, మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక పెళ్లికి మందర బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేయడమే కాదు… హీరోయిన్‌గా మూడు చిత్రాల్లో కనబడింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి