Home » Entertainment » Niharika Konidela Dance For Super Hit Songs
Entertainment

Niharika Konidela : హిట్ సాంగ్స్ అన్నీ క‌వ‌ర్ చేసిన నిహారిక‌.. ఆ దూకుడేందంటున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: September 23, 2022, 7:30 pm
Advertisement

Niharika Konidela : మెగా డాట‌ర్ నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు ముందు హైద‌రాబాద్‌లో పార్టీ జ‌రుగుతున్న‌ ప‌బ్‌పై పోలీసులు దాడి చేశారు. అక్క‌డ నిహారిక కొణిదెల ఉండ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది. త‌ర్వాత ఆమెను పోలీసులు వదిలేసినా నెటిజ‌న్స్ మాత్రం ట్రోల్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో సైలెంట్ అయింది. కొద్ది రోజుల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చి తాను పాఠాల‌ను నేర్చుకున్నాన‌ని చెబుతూ ర‌చ్చ చేస్తుంది.

Advertisement

తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరియోగ్రాఫ‌ర్ మృణాలి కిర‌ణ్‌తో క‌లిసి ఇటీవ‌ల విడుద‌లైన చిత్రాల‌కు సంబంధించిన సినిమాల‌లోని పాట‌ల‌కు సిగ్నేచ‌ర్ స్టెప్ప్ వేసింది. ఆర్ఆర్ఆర్, పుష్ప‌, మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం ఇలా ప‌లు హిట్ సినిమా సాంగ్స్‌కి డ్యాన్స్ చేశారు. ప్ర‌స్తుతం నిహారిక త‌న సోష‌ల్ మీడియాలో చేసిన డ్యాన్స్ అందరిని ఆక‌ట్టుకుంటుంది. ఈ అమ్మ‌డి డ్యాన్స్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూబాయ్ లుక్ మాదిరిగా రెడీ అయిన పిక్స్ షేర్ చేసింది. అవి కూడా తెగ వైర‌ల్ అయ్యాయి. కొందరు యూట్యూబర్స్‌తో పాటు కంటెంట్‌ క్రియేటర్స్‌ కలిసి పాల్గొన్న కాస్ట్యూమ్ పార్టీలో నిహారిక హల్చల్‌ చేసింది.

Niharika Konidela dance for super hit songs

Advertisement

Niharika Konidela : అద్ద‌ర‌గొట్టేసావు..

క్యాస్టూమ్‌ పార్టీ అంటేనే డిఫ్రెంట్‌ గెటప్‌లో హాజరుకావడం. ఈ పార్టీకి నిహారిక గంగూబాయ్‌ లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ముంబైకి చెందిన లేడీ డాన్‌ గంగూబాయ్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో గంగూబాయ్‌ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్‌ గంగూబాయ్‌ పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించి మెప్పించింది. ఇందులో వైట్‌ శారీలో నుదుట బొట్టుతో ఆకట్టుకుంది.అలానే నిహారిక కూడా క‌నిపించి ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం నిహారిక నిర్మాత‌గా రాణిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి