Home » Entertainment » Niharika Konidela Funny Reply On Asking Phone Number
Entertainment

Niharika Konidela : నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు షాక్ ఇచ్చిన నిహారిక‌.. హుష్ అంటూ ఫొటో పోస్ట్

Authored By
mallesh
The Telugu News | Updated on: June 8, 2022 1:06 pm
Advertisement

Niharika Konidela : మెగా డాట‌ర్ నిహారిక పెళ్లి త‌ర్వాత కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నా ప్ర‌స్తుతం ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఓ ప‌క్క వెబ్ సిరీస్ లు, మ‌రో వైపు సినిమాల‌తో బిజీగా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ అభిమానుల‌తో టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా ముచ్చ‌టిస్తోంది. ప్ర‌స్తుతం న‌యా లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. షార్ట్ హెయిర్ తో హాట్ లుక్ లో సంద‌డి చేస్తోంది. ఈ లుక్ కొత్త సినిమా కోస‌మా.. అని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల జోర్డాన్ ట్రిప్ తో భ‌ర్త‌తో క‌లిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.

Advertisement

ఒక మ‌న‌సు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చ‌న నిహారిక ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ మ‌ధ్య బుల్లితెర‌పై కూడా క‌నిపించి సంద‌డి చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో ఓ పాత్ర‌లో మెరిసింది. కాగా భ‌ర్త‌తో క‌ల‌సి వ‌ర్కౌట్లు చేస్తూ తెగ సంద‌డి చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేస్తూ వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం నిహారిక వెబ్ సిరీస్ లు ప్రొడ్యూస్ చేస్తూ, న‌టిస్తూ బిజీగా ఉంటోంది. కాగా సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే నిహారిక అభిమానుల‌తో చిట్ చాట్ చేస్తోంది. తాజాగా నెటిజ‌న్ల‌తో కాస్త వెరైటీగా ముచ్చటిస్తోంది.

niharika konidela funny reply on asking phone number

Advertisement

నెటిజ‌న్ల‌కు కొన్ని నంబర్లను ఆప్షన్లుగా ఇస్తూ ఒక్కో నంబర్‌కు ఒక్కో ప్రశ్నను వేసింది. ఆ నంబర్ చెబితే.. సదరు ప్రశ్నకు సంబంధించిన సమాధానం చెబుతాన‌ని తెలిసింది. దీంతో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు అడిగారు. అందులో ఓ నెటిజ‌న్ కావాల‌ని అడిగాడో లేక తెలియ‌క అడిగాడో తెలియ‌దు గానీ.. ఆర్ యూ సింగిల్ అనేసాడు.. దీంతో నిహారిక త‌న భ‌ర్త ఫొటోను షేర్ చేస్తూ నేను సింగిలేనా అంటూ త‌న భ‌ర్త‌ను ట్యాగ్ కూడా చేసింది. మ‌రో నెటిజ‌న్ కొంటెగా మ‌రో ప్ర‌శ్న వేశాడు. ఇక మరో నెటిజన్ మ‌రో అడుగు ముందుకేసి నంబర్ గురించి అడిగాడు. హుష్..!! చెప్పొద్దు.. అది సీక్రెట్ అన్న‌ట్లుగా ఫోజిచ్చిన పొటో పెట్టేసింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి